పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ ఉద్యోగాలు..! రేపటితో లాస్ట్..!

పశ్చిమ రైల్వేకు చెందిన రిక్రూట్మెంట్‌ సెల్.. ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందుకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 99 ఖాళీలున్నాయి. ఇప్పటికీ రైల్వేలో పనిచేస్తోన్న వారికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ (జీడీసీఈ) ద్వారా ఈ పోస్టుల్ని ప్రకటించింది పశ్చిమ రైల్వే సంస్థ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా […]

పశ్చిమ రైల్వేలో సీనియర్ క్లర్క్ ఉద్యోగాలు..! రేపటితో లాస్ట్..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 13, 2019 | 2:45 PM

పశ్చిమ రైల్వేకు చెందిన రిక్రూట్మెంట్‌ సెల్.. ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందుకు సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మొత్తం 99 ఖాళీలున్నాయి. ఇప్పటికీ రైల్వేలో పనిచేస్తోన్న వారికి జనరల్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ (జీడీసీఈ) ద్వారా ఈ పోస్టుల్ని ప్రకటించింది పశ్చిమ రైల్వే సంస్థ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను rrc-wr.com వెబ్‌సైట్‌లో చూడొచ్చు. రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది. ఈ ఉద్యోగానికి విద్యార్హత డిగ్రీ. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. దీనికి చివరి తేది అక్టోబర్ 15. రైల్వేలో పనిచేస్తున్న వాళ్లతో పాటుగా..  ప్రభుత్వ, ప్రత్యేకంగా రైల్వే ఉద్యోగాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చని పశ్చిమ రైల్వే సంస్థ తెలియజేసింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu