మూడో టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోర్..

మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది.

  • Ravi Kiran
  • Publish Date - 6:35 pm, Sat, 25 July 20
మూడో టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోర్..

ENG Vs WI: మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిధ్య ఇంగ్లాండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. ఓలీ పోప్‌(91), జోస్‌ బట్లర్(67), రోరీ బర్న్స్‌(57), స్టువర్ట్‌ బ్రాడ్‌(62) అర్ధ శతకాలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్ అయింది. చివరిలో బ్రాడ్ మెరుపులు మెరిపించడంతో ఇంగ్లాండ్ జట్టు పటిష్టస్థితిలో నిలిచింది. 2017 తర్వాత బ్రాడ్ హాఫ్ సెంచరీ చేయడం ఇదే తొలిసారి. ఇక విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ 4 వికెట్లు తీయగా.. గాబ్రియల్, ఛేజ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అటు బ్యాటింగ్ మొదలుపెట్టిన విండీస్ జట్టు ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ బ్రాట్ వైట్ ఒక్క పరుగుకే పెవిలియన్ చేరాడు. కాగా, ఇరు జట్ల మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉంది. ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్లను పెంచుకోవాలని అటు ఇంగ్లాండ్, ఇటు విండీస్ జట్లు ప్రయత్నిస్తున్నాయి.