ప‌శ్చిమ‌లో అధికారుల నిర్ల‌క్ష్యం…అమ్మోరి జాత‌ర‌లా ముసిరిన జ‌నం…

పశ్చిమ గోదావ‌రి జిల్లా నరసాపురంలో అధికారుల‌కు క‌నీస అవ‌గాహ‌న లేకుండా పోయింది. అస‌లే క‌రోనా వ్యాప్తితో గ‌డ‌గ‌డ‌లాడుతుంటే.. వారు త‌మ ప‌నులు త్వ‌ర‌గా అయిపోతే చాలు అన్న‌ట్లుగా ప్ర‌వ‌రిస్తున్నారు.

ప‌శ్చిమ‌లో అధికారుల నిర్ల‌క్ష్యం...అమ్మోరి జాత‌ర‌లా ముసిరిన జ‌నం...
Follow us

|

Updated on: Jun 26, 2020 | 4:04 PM

పశ్చిమ గోదావ‌రి జిల్లా నరసాపురంలో అధికారుల‌కు క‌నీస అవ‌గాహ‌న లేకుండా పోయింది. అస‌లే క‌రోనా వ్యాప్తితో గ‌డ‌గ‌డ‌లాడుతుంటే.. వారు త‌మ ప‌నులు త్వ‌ర‌గా అయిపోతే చాలు అన్న‌ట్లుగా ప్ర‌వ‌రిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఉచితంగా ఇండ్ల స్ధలాలు కేటాయించిన ల‌బ్దిదారుల‌కు ఫోన్ చేసి.. ఆ స్థలాల్లో ఫోటోలు దిగేందుకు రావాలని కోరారు. స‌రే..ర‌మ్మ‌న్నారు..అందుకు త‌గ్గ ఏర్పాట్లు చేశారంటే అదీ లేదు. ఇక మ‌న జ‌నం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సింది ఏముంది. అదేదో అమ్మోరీ జాత‌ర‌కు త‌ర‌లివ‌చ్చిన‌ట్టు ఒక్క‌సారే తండోపతండాలుగా వ‌చ్చారు. అందులో ఒక్క‌రు కూడా భౌతిక‌దూరం పాటించ‌డం లేదు. లబ్ధిదారులుగా ఉన్న కొంద‌రు మ‌హిళ‌లు కంటైన్మెంట్ ప్రాంతాల నుంచి రావ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అధికారులు..ఇలా చెయ్య‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 605 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 570 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చినవారిలో 35 మందికి కరోనా సోకింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,489కి చేరింది. ఇందులో 6,147 పాజిటివ్ కేసులు ఉండగా, 5196 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు కరోనా కారణంగా 146 మంది మరణించారు. ఇక గడిచిన 24 గంటల్లో 191 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, 10 మంది కరోనాతో మృతి చెందారు.