Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వెదర్‌ అలర్ట్‌.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..

ఆ జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులు, గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు వెదర్‌ అలర్ట్‌.. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..
Weather Alert
Follow us

|

Updated on: Aug 15, 2022 | 6:54 AM

Weather update: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. పశ్చిమ బెంగాల్‌, ఉత్తర ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలి.. కొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరి కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దీని ప్రభావంతో ఈ నెల 18వ తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల్లో నేడు ఉరుములు, మెరుపులు, గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

అటు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, మెదక్‌, వరంగల్‌, హన్మకొండ, జయశంకర్‌ భూపాల్‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌, ఖమ్మం, మేడ్చల్‌- మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

అల్పపీడన ప్రభావం అటు ఏపీలోనూ తీవ్రంగా ఉంది. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ జిల్లాల్లో పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురిశాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సీతంపేట, వీరఘట్ట, పాలకొండ తదితర మండలాల్లో భారీగా వర్షాలు పడ్డాయి. విజయనగరం, బబ్బిలి, సాలూరు తదితర మండలాల్లో చెదురుమదురుగా జల్లులు కురిశాయి. శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి. తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

వాయుగుండం పశ్చిమ బెంగాల్‌ దిఘాకు ఆగ్నేయంగా దాదాపు పది కిలోమీటర్ల దూరంలో బాలాసోర్‌ (ఒడిశా)కు తూర్పు ఈశాన్యంగా 90 కిలోమీటర్ల దూరంలో ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ఆదివారం రాత్రి వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పశ్చిమ బెంగాల్‌, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా తీరాలు, దిఘాకు దగ్గరగా ప్రయాణించి పశ్చిమ వాయువ్య దిశ కదులుతూ వచ్చే 24 గంటలు అంటే ఈ నెల 16 వరకూ వాయుగుండంగానే కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్రలో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు.

నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
నేటి నుంచే తెలుగు రాష్ట్రాల్లో బడులకు వేసవి సెలవులు
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
విజయ్, ప్రశాంత్ నీల్ కాంబోలో మూవీ.. అసలు మ్యాటర్ ఇదే..
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం