26 న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం మా రాజ్యాంగ బద్ద హక్కు, పంజాబ్ రైతు సంఘాలు, ప్రశాంతంగా నిరసన

ఈ నెల 26 న  ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, ఇది తమ రాజ్యాంగబద్ద హక్కు అని పంజాబీ రైతు సంఘాలు పేర్కొన్నాయి.

26 న ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించడం  మా రాజ్యాంగ బద్ద హక్కు,  పంజాబ్ రైతు సంఘాలు, ప్రశాంతంగా నిరసన
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 18, 2021 | 4:59 PM

ఈ నెల 26 న  ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తామని, ఇది తమ రాజ్యాంగబద్ద హక్కు అని పంజాబీ రైతు సంఘాలు పేర్కొన్నాయి.  రాజ్ పథ్ లో జరిగే పరేడ్ కి తాము ఎట్టి పరిస్థితుల్లోనూ భంగం కలిగించబోమని, ఢిల్లీ శివార్లలో శాంతియుతంగా ఈ ర్యాలీ జరుగుతుందని తెలిపాయి. పోలీసులు ఒక వేళ అనుమతించకపోతే ఏం చేస్తారని ప్రశ్నించగా ప్రత్యామ్నాయ మార్గాలలో అనుమతించాలని కోరుతామని,  ఈ విషయంలో తమ కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని భారతీయ కిసాన్ యూనియన్ నేతలు తెలిపారు.ఈ ర్యాలీ విషయమై ఢిల్లీ పోలీసులే నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది.  ఈ నేపథ్యంలో మొదట తాము పోలీసులతో చర్చిస్తామని, వారి సూచన ప్రకారం నడుచుకుంటామని ఈ నేతలు చెప్పారు. గణ తంత్ర దినోత్సవాలకు ఏ మాత్రం భంగం కలిగించరాదన్నదే తమ లక్ష్యమన్నారు. ఆ రోజున సుమారు 20 వేల ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించాలని రైతు సంఘాలు భావిస్తున్నాయి. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా తమ ట్రాక్టర్లతో ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొంటారని ఆశిస్తున్నారు.