మీకు “జన్ ధన్‌” అకౌంట్ ఉందా..? దాని లాభాలు తెలుసా..? లేదంటే ఇలా తీసుకోండి

జన్ ధన్ యోజన.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు గ్రామీణ ప్రాంతానికి కూడా అతి తక్కువ సమయంలో చేరువయ్యాయి. అంతేకాక ఈ పథకం ద్వారా.. ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకు అకౌంట్లు తెరవడంతో.. ఈ పథకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో […]

మీకు జన్ ధన్‌ అకౌంట్ ఉందా..? దాని లాభాలు తెలుసా..? లేదంటే ఇలా తీసుకోండి
Follow us

| Edited By:

Updated on: Feb 07, 2020 | 7:15 AM

జన్ ధన్ యోజన.. ఇది ప్రధాని నరేంద్ర మోదీ తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం. దేశంలోని ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా బ్యాంకింగ్ సర్వీసులు గ్రామీణ ప్రాంతానికి కూడా అతి తక్కువ సమయంలో చేరువయ్యాయి. అంతేకాక ఈ పథకం ద్వారా.. ప్రజలు పెద్ద ఎత్తున బ్యాంకు అకౌంట్లు తెరవడంతో.. ఈ పథకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్ధానం సంపాదించుకుంది. అయితే అసలు ఈ జన్ ధన్ యోజన్ కింద బ్యాంక్ ఖాతాలను తెరవడం ఎలా.. దాని వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకోండి.

జన్ ధన్ ఖాతా తెరవడం ఎలా..

జన్ ధన్ అకౌంట్ అనేది జీరో అకౌంట్. దీనిని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా తెరవవచ్చు. అంతేకాదు.. పలు కార్పొరేషన్ బ్యాంకులతో పాటు.. పోస్టాఫీస్‌లో కూడా ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యవచ్చు. ఈ ఖాతా తెరవడానికి మీకు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, నివాస పత్రం, రెండు ఫోటోలు ఉంటే చాలు. ఇక ఈ అకౌంట్‌ ప్రారంభించేందుకు ఎవరి ష్యూరిటీ అవసరం లేదు.

బ్యాంకుల్లో కాకుండా కూడా ఇలా తీసుకోవచ్చు..

ఇక సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు దాదాపు రద్దీగా ఉంటాయి. దీంతో ఈ అకౌంట్ ఓపెన్ చెయ్యడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక ఈ అకౌంట్‌ను మరో విధంగా కూడా ఓపెన్ చెయ్యవచ్చు. ప్రతి గ్రామంలో బ్యాంకింగ్ సర్వీసులు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో బ్యాంకు మిత్ర ఏజెంట్లను కూడా ప్రభుత్వం నియమించింది. వీరి ద్వారా కూడా ఈ జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేసే సౌలభ్యం ఉంది. అంతేకాదు.. వీరి వద్ద నుంచి కూడా  బ్యాంకు లావాదేవీలు కొనసాగించవచ్చు.

జన్ ధన్ అకౌంట్ లాభాలు..

ఇక ఈ జన్ ధన్ అకౌంట్ ప్రారంభించడానికి ఎలాంటి రుసుము అక్కర్లేదు జీరో బ్యాలెన్స్‌తో మీ అకౌంట్ తెరవబడుతుంది ఈ జన్‌ ధన్ ఖాతాకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయదు జన్ ధన్‌ ఖాతా ద్వారా ఏటీఎం కార్డుగా “రూపే” కార్డు జారీ అవుతుంది ఈ రూపే కార్డుకు ఎలాంటి రుసుము ఉండదు రూపే కార్డుకు రూ.1లక్ష ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఈ ఖాతాలోకి కేంద్ర ప్రభుత్వ పథకాలు.. నగదు బదిలీ వంటివి డైరక్టుగా జమ చేయడానికి వీలుంటుంది. ఇక మీరు నియమితంగా దీనిని ఉపయోగిస్తే.. బ్యాంకు మీకు ఓవర్ డ్రాఫ్ట్ (రూ.5000) సౌకర్యం కూడా కల్పిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఈ ఓవర్ డ్రాఫ్ట్ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ఈ సౌకర్యాన్ని ఆరు నెలల పాటు బ్యాంకు ఖాతాలో లావాదేవీలు నిర్వహించిన తర్వాతే అందిస్తున్నారు.

ఇక ఈ అకౌంట్లను మైనర్లకు కూడా ప్రారంభించవచ్చు. అయితే ఇందుకు వారి తరఫున వారి సంరక్షకులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సో.. పై లాభాలన్నీ మీకు కూడా కావాలంటే.. వెంటనే మీరు జన్ ధన్ ఖాత తెరవండి. అందుకోసం సమీప బ్యాంకును కానీ.. పోస్టాఫీసులో కానీ సంప్రదించండి.

అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
అందమైన దుబాయ్‌ని ఛిద్రం చేసిన వర్షం.. తిరిగి మెరవాలంటే ఎంతఖర్చు.?
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
ఈ 5 అలవాట్లు సంబంధాల్లో చీలికను సృష్టిస్తాయి.. ఈరోజే మార్చుకోండి
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
సింగిల్ చార్జ్‌పై ఏకంగా 300 కి.మీ. కొత్త స్కూటర్ అదిరింది..
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
మీన రాశిలో రెండు గ్రహాల కలయిక..వారి జీవితాల్లో పెనుమార్పులు పక్కా
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
బాప్‌రే.. ఏం డ్రామా అక్కా! హెల్మెట్‌ లేకుండా పట్టుబడిన లేడీ టీచర్
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
ఈ వస్తువులు మీ పాకెట్‌లో పెట్టుకుంటే అన్నింట్లోనూ మీదే విజయం..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!