పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే దగ్గర పైప్‌ లైన్ లీక్.. భారీఎత్తున ఎగసిపడిన వాటర్, ప్రాంతమంతా జలమయం

హైదరాబాద్ మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే పీవీ నర్సింహరావు ఎక్స్‌ప్రెస్‌ వే దగ్గర పైప్‌ లైన్ లీక్ అయింది. దీంతో సినీ ఫక్కీని తలపించే..

పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే దగ్గర పైప్‌ లైన్ లీక్.. భారీఎత్తున ఎగసిపడిన వాటర్,  ప్రాంతమంతా జలమయం

హైదరాబాద్ మెహదీపట్నం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే దగ్గర పైప్‌ లైన్ లీక్ అయింది. దీంతో సినీ ఫక్కీని తలపించే రీతిన వాటర్ ఫాల్ సీన్స్ క్రియేట్ అయ్యాయి. పీవీ ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నెంబర్‌ 53 దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. భారీఎత్తున నీరు ఎగసిపడ్డంతో ఆ ప్రాంతమంతా జలమయమైంది. ఆకాశధార అంటే.. పై నుంచి కిందకు పడడం తెలుసు. కానీ కింది నుంచి ఆకాశాన్నంటినట్టుగా నీరు ఎగిసిపడుతుంటే చూపరులు తలతిప్పుకోలేకపోయారు. ఫలితంగా ట్రాఫిక్ కు కూడా అంతరాయం ఏర్పడింది. అయితే, వృధాగా పోతోన్న తాగునీటిని చూసి.. అయ్యో అనుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు, ఎక్కడ నీటి కటకట వస్తుందోనన్న భయాన్ని స్థానికులు వ్యక్తం చేశారు.

Click on your DTH Provider to Add TV9 Telugu