కృష్ణాజిల్లాలో వైన్ షాపు వాచ్ మెన్ ఆత్మ‌హ‌త్య‌..రీజ‌న్ ఇదే..

కృష్ణాజిల్లాలో వైన్ షాపు వాచ్ మెన్ ఆత్మ‌హ‌త్య‌..రీజ‌న్ ఇదే..

కృష్ణాజిల్లాలో మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవ‌డ‌మే అత‌ని ప్రాణాల మీదకు తెచ్చింది. స్ధానికంగా ఉండే ఓ వైన్ షాపు ప‌నిచేసే ఇద్దరు ఉద్యోగులు లాక్ డౌన్ ఉన్నా దొంగ‌త‌నంగా మద్యం తరలిస్తుండగా.. కోటేశ్వరరావు అనే వాచ్ మెన్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు వాచ్ మెన్ ను కొట్టి మద్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే అత‌డు మృతుడై కనిపించాడు. వైన్ షాప్ ఉద్యోగుల దాడి తర్వాత క‌ల‌త […]

Ram Naramaneni

|

May 05, 2020 | 8:00 PM

కృష్ణాజిల్లాలో మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం అక్రమ రవాణాను అడ్డుకోవ‌డ‌మే అత‌ని ప్రాణాల మీదకు తెచ్చింది. స్ధానికంగా ఉండే ఓ వైన్ షాపు ప‌నిచేసే ఇద్దరు ఉద్యోగులు లాక్ డౌన్ ఉన్నా దొంగ‌త‌నంగా మద్యం తరలిస్తుండగా.. కోటేశ్వరరావు అనే వాచ్ మెన్ అడ్డుకున్నాడు. దీంతో ఆగ్రహించిన వారు వాచ్ మెన్ ను కొట్టి మద్యాన్ని ఎత్తుకెళ్లారు. ఆ త‌ర్వాత కొద్దిసేప‌టికే అత‌డు మృతుడై కనిపించాడు.

వైన్ షాప్ ఉద్యోగుల దాడి తర్వాత క‌ల‌త చెందిన‌ వాచ్ మెన్ కోటేశ్వరరావు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై స్ధానికులు ఓ రేంజ్ లో ఫైర‌వుతున్నారు. వైన్ షాప్ ఉద్యోగులు..వారి అక్ర‌మాలు భ‌య‌ట‌ప‌డ‌తాయ‌నే భయంతోనే వాచ్ మెన్ కు పురుగుల మందు తాగించి చంపారని ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో నిశితంగా ద‌ర్యాప్తు జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పీఎస్ ముందు స్ధానికులు బైఠాయించారు. దీంతో ఉద్రిక్తత ప‌రిస్థితి నెల‌కుంది. మృతుడు కోటేశ్వరరావు గతంలో ఎంపీపీగా పనిచేయడంతో ఆయనకు మంచి పేరుంది. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu