స్థానిక మార్కెట్లలో భారీగా పెట్టుబడులు.. దేశీయ ఉత్పత్తుల ఎగుమతులపై వాల్ మార్ట్ ఫోకస్..

భారత్‌లో తయారైన  ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేయడంపై వాల్ మార్ట్ ఫోకస్ పెట్టింది. 2027 నాటికి ఈ ఎగుమతులను 3 రేట్లు పెంచి 10 బిలియన్ డాలర్లను చేరుస్తామని ధీమా వ్యక్తం చేసింది. దేశీయ...

స్థానిక మార్కెట్లలో భారీగా పెట్టుబడులు.. దేశీయ ఉత్పత్తుల ఎగుమతులపై వాల్ మార్ట్ ఫోకస్..
Follow us

|

Updated on: Dec 11, 2020 | 5:59 AM

Walmart Aims : దేశీయ ఈ కామర్స్ రంగంలో గుత్తాధిపత్యం దిశగా ప్రముఖ కంపెనీలు రంగంలో దిగాయి. ఇప్పటికే అమెజాన్ టాప్ పోజిషన్‌లో ఉండగా.. రిలయన్స్ జియో మార్ట్ కూడా వరుస టేకోవర్లతో సిద్ధమవుతోంది. అటు టాటాలు కూడా బిగ్ బాస్కెట్ డీల్ ఓకే చేసుకుని.. కొత్త కొత్త కంపెనీలపై ద్రుష్టి పెట్టింది. త్వరలో సూపర్ యాప్ లో వస్తోంది. ఇక వాల్ మార్ట్ చేతికి చిక్కిన ఫ్లిప్ కార్ట్ కూడా విస్తరణ బాటలో ఉంది. మొత్తానికి రెండు దేశీయ దిగ్గజాలు.. మరో రెండు అమెరికన్ కంపెనీల మొత్తం నాలుగు కంపెనీల మధ్య పోటీ పీక్ లో ఉంది.

ఇదిలావుంటే.. భారత్‌లో తయారైన  ఉత్పత్తులను అంతర్జాతీయంగా ఎగుమతి చేయడంపై వాల్ మార్ట్ ఫోకస్ పెట్టింది. 2027 నాటికి ఈ ఎగుమతులను 3 రేట్లు పెంచి 10 బిలియన్ డాలర్లను చేరుస్తామని ధీమా వ్యక్తం చేసింది. దేశీయ జూవెలరీ, హోంవేర్ వంటి ఉత్తత్తులకు వాల్ మార్ట్ అంతర్జాతీయ గిరాకీ కల్పిస్తోంది. స్థానిక ఉత్తులపై భారీగా పెట్టుబడులు పెడుతూ రిటైల్ రంగంలో దూసుకుకెళ్తోంది. ప్రస్తుతం 3 బిలియన్ డాలర్ల విలువైన భారత ఉత్పత్తులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తోంది.