గ‌వ‌ర్న‌మెంట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఆర్డీవో…

గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రులంటే జ‌నం కాస్త జంకుతార‌న్న మాట వాస్త‌వం. అక్కడ స్టాఫ్.. పేషెంట్ల‌ను స‌రిగ్గా పట్టించుకోరని, సౌకర్యాలు నామ‌మాత్రంగా ఉంటాయ‌న్న అప‌వాదు ఉంది.

గ‌వ‌ర్న‌మెంట్ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన ఆర్డీవో...
Follow us

|

Updated on: Jun 27, 2020 | 8:04 PM

గ‌వ‌ర్న‌మెంట్ ఆస్పత్రులంటే జ‌నం కాస్త జంకుతార‌న్న మాట వాస్త‌వం. అక్కడ స్టాఫ్.. పేషెంట్ల‌ను స‌రిగ్గా పట్టించుకోరని, సౌకర్యాలు నామ‌మాత్రంగా ఉంటాయ‌న్న అప‌వాదు ఉంది. మ‌రీ పేద‌వారు త‌ప్పితే… సామాన్య, మధ్యతరగతి ప్రజలు సైతం ఖ‌ర్చు ఎక్కువ అయినా స‌రే అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ప్రైవేటు ఆస్పత్రులనే ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ప్రసవ సమయంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి కాబ‌ట్టి ప్రైవేట్ ఆస్పత్రుల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇందుకు భిన్నంగా సర్కారీ ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుని ప‌లువు‌రికి ఆదర్శంగా నిలిచారు ఏపీలోని విజయనగరం ఆర్డీవో కె.హేమలత.

గురువారం సాయంత్రం వరకూ ఆమె పలు గ‌వ‌ర్న‌మెంట్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాత్రి సమయంలో పురిటి నొప్పులు రావ‌డంతో… జిల్లా కేంద్రంలో ల‌గ్జ‌రీ వ‌స‌తులున్న‌ ప్రైవేటు ఆస్పత్రులు ఉన్నప్పటికీ, ఘోషా ఆసుపత్రికే కుటుంబ సభ్యులు ఆమెను తీసుకెళ్లారు. అర్ధరాత్రి పండంటి మగబిడ్డకు హేమలత జన్మనిచ్చారు. ప్ర‌స్తుతం త‌ల్లీబిడ్డ ఇద్ద‌రూ ఆరోగ్యంగానే ఉన్నారు.