‘విస్తారా ఎయిర్‌లైన్స్’ కు తప్పిన ముప్పు!

ముంబయి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. 153 మంది ప్రయాణికులతో సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబయి నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు ఢిల్లీకి చేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతి లభించలేదు. దీంతో సమీపాన ఉన్న లఖ్‌నవూకు వెళ్లాలని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది సూచించారు. పైలట్‌ అందుకనుగుణంగానే అక్కడికి చేరకున్నారు. కానీ, అక్కడా వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో వారు మళ్లీ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:49 pm, Wed, 17 July 19
'విస్తారా ఎయిర్‌లైన్స్' కు తప్పిన ముప్పు!

ముంబయి నుంచి దిల్లీకి వెళ్లాల్సిన ‘విస్తారా ఎయిర్‌లైన్స్‌’కు చెందిన విమానానికి సోమవారం పెను ప్రమాదం తప్పింది. 153 మంది ప్రయాణికులతో సోమవారం మధ్యాహ్నం 3.30గంటలకు ముంబయి నుంచి బయలుదేరి సాయంత్రం 5గంటలకు ఢిల్లీకి చేరింది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఢిల్లీ విమానాశ్రయంలో దిగేందుకు అనుమతి లభించలేదు. దీంతో సమీపాన ఉన్న లఖ్‌నవూకు వెళ్లాలని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బంది సూచించారు.

పైలట్‌ అందుకనుగుణంగానే అక్కడికి చేరకున్నారు. కానీ, అక్కడా వాతావరణ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో వారు మళ్లీ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లాలని కోరారు. ప్రయాగ్‌రాజ్‌కి సమీపాన ఉన్న తరుణంలో పరిస్థితులు చక్కబడ్డాయని.. తిరిగి లఖ్‌నవూకి రావాలని పైలట్‌కు మరో సందేశం అందింది. లఖ్‌నవూలో ప్రయాణికులకు మెరుగైన వసతులు ఉండడంతో తిరిగి అక్కడికే వెళ్లాలని పైలట్‌ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో విమానంలో ఉన్న అదనపు ఇంధనం కూడా అయిపోవస్తోంది. మరో పది నిమిషాలైతే ఇంధనం పూర్తిగా అయిపోతుందన్న సమయంలో పైలట్‌ లఖ్‌నవూ విమానాశ్రయానికి అత్యవసర సిగ్నల్‌ అయిన ‘మే డే’ కాల్‌ పంపించారు. దీంతో అప్రమత్తమైన అక్కడి సిబ్బంది వెంటనే విమానం ల్యాండింగ్‌కు అన్ని అనుమతులిచ్చారు. విమానం సురక్షితంగా దిగింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.