చదరంగంలో చిచ్చర పిడుగు..ఎనిమిదేళ్లకే రికార్డ్‌

చదరంగంలో చిచ్చర పిడుగు..ఎనిమిదేళ్లకే రికార్డ్‌

మేధో క్రీడ చదరంగం(చెస్‌)లో భారత క్రీడాకారుల సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. భారత చెస్ ఎవర్ గ్రీన్ స్టార్ విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించి సంచలనం సృష్టించగా, చిన్నతనం నుంచే శిక్షణ పొందిన కొనేరు హంపి వంటి వారు చెస్‌ క్రీడారంగంలో ఎంతగానో రాణించారు. తాజాగా విశాఖకు చెందిన ఎనిమిదేళ్ల చిచ్చర పిడుగు మీనాక్షి.. మరో ఛాంపియన్ షిప్ను గెలుచుకుని రికార్డు నెలకొల్పింది. ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్ షిప్లో […]

Pardhasaradhi Peri

|

Sep 20, 2019 | 1:42 PM

మేధో క్రీడ చదరంగం(చెస్‌)లో భారత క్రీడాకారుల సంచలనాల పరంపర కొనసాగుతూనే ఉంది. భారత చెస్ ఎవర్ గ్రీన్ స్టార్ విశ్వనాథన్ ఆనంద్ 18 ఏళ్ల వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా సంపాదించి సంచలనం సృష్టించగా, చిన్నతనం నుంచే శిక్షణ పొందిన కొనేరు హంపి వంటి వారు చెస్‌ క్రీడారంగంలో ఎంతగానో రాణించారు. తాజాగా విశాఖకు చెందిన ఎనిమిదేళ్ల చిచ్చర పిడుగు మీనాక్షి.. మరో ఛాంపియన్ షిప్ను గెలుచుకుని రికార్డు నెలకొల్పింది. ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్ షిప్లో ప్రపంచంలో 15 మంది ఆటగాళ్లలో ఒకరిగా నిలిచింది. ఢిల్లీలో జరిగిన వెస్ట్రన్ అసియన్ జూనియర్ అండ్ యూత్ ఛెస్ ఛాంపియన్ షిప్ లో రెండు బండారు, ఒక కాంస్య పతకాలను సాధించింది. విశాఖకు చెందిన కొలగట్ల అలన మీనాక్షి… చదరంగంలో చిచ్చర పిడుగులా దూసుకెళ్తోంది. మూడో తరగతి చదవుతున్న ఈ చిన్నారి… రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు గెలుస్తూ తన విజయప్రస్థానాన్ని పరుగులు పెట్టిస్తోంది. కామన్వెల్త్ చెస్ చాంఫియన్షిప్ పోటీల్లో పాల్గొన్న మీనాక్షి… ఆరో స్థానంలో నిలించిది. గతేడాది శ్రీలంకలో నిర్వహించిన ఆసియన్ స్కూల్ ఆఫ్ ఛాంపియన్షిప్లో నాలుగు పతకాలను సాధించింది. ఒక బంగారు, ఒక వెండి, రెండు కాంస్య పతకాలను దక్కించుకొని రికార్డు నెలకొల్పింది. తాజాగా చైనాలో జరిగిన ప్రపంచ కేడెట్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున పాల్గొన్న 15 మంది క్రీడాకారుల జాబితాలో స్థానం దక్కించుకుంది. ఈ నెల నాలుగు నుంచి 11 వరకు ఢిల్లీలో జరిగిన వెస్ట్రన్ ఆసియన్ జూనియర్ అండ్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లో మీనాను నాలుగు పతకాలు వరించాయి. చిన్నతనంలోనే రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణిస్తున్న మీనాక్షి విజయాల పట్ల తల్లిదండ్రులు, బంధువులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు మేధోశక్తితో మరిన్ని విజయాలను సాధించాలని ఆశిస్తున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu