“మా ఆయన అంతే” అంటున్న అనుష్క

చాలాసార్లు సినిమా చూస్తూ మధ్యలోనే విరాట్‌ కోహ్లీ నిద్రపోయాడని అతడి భార్య, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ చెప్పింది. కలిసి సినిమాలు చూస్తున్నప్పుడల్లా

  • Sanjay Kasula
  • Publish Date - 1:18 pm, Thu, 13 August 20
"మా ఆయన అంతే" అంటున్న అనుష్క

సెలబ్రిటీ జంట విరాట్‌ కోహ్లీ-అనుష్క శర్మ లాక్ డౌన్ సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటున్నారు. వివాహం చేసుకున్నప్పటి నుంచి విరుష్క జోడి ఇంతకాలం ఒకచోట ఉండడం ఇదే తొలిసారి. ఇంటికే పరిమితమైన వీరిద్దరూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ ‌మీడియాలో పంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి వంట చేస్తున్న వీడియోలు, సరదాగా గడిపే ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ మధ్య విరాట్ స్పందిస్తూ.. అనుష్క దొరకడం నా అద‌ృష్టం అని చెప్పగా.. ఆ తర్వాత ఇద్దరు గొడవ పడితే మొదటగా ఎవరు సారీ చెబుతారో తెలుసా అంటూ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మరో విషయాన్ని ఫ్యాన్స్ కోసం చెప్పుకొచ్చింది అనుష్కా శర్మ.

చాలాసార్లు సినిమా చూస్తూ మధ్యలోనే విరాట్‌ కోహ్లీ నిద్రపోయాడని అతడి భార్య, బాలీవుడ్‌ బ్యూటీ అనుష్క శర్మ చెప్పింది. కలిసి సినిమాలు చూస్తున్నప్పుడల్లా అతడు మెలకువతోనే ఉన్నాడా అని గమనిస్తుంటానని తెలిపింది. అనుష్కను సంతోషంగా ఉంచే విషయం ఏంటి అని ఓ అభిమాని అడుగగా.. పెంపుడు జంతువులు అని విరాట్‌ అనగా… ‘కాదు నువ్వే’ అని చెప్పింది. కోహ్లీ ఫోటోలు అసలు బాగా తీయడని అనుష్క చెప్పింది. ఇలా సరదా సమాధానాలతో వీడియో లైవ్ సాగింది.