IPL 2020 RCB Vs DC : ఐపీఎల్‌లో ఇవాళ మరో ‘కీ’ ఫైట్

IPL 2020 RCB Vs DC : ఐపీఎల్‌లో ఇవాళ మరో కీలక పోరు జరుగనుంది. దుబాయ్‌ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన కోహ్లీ సేన పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి రెండవ స్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మంచి జోరు మీదుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ […]

IPL 2020 RCB Vs DC : ఐపీఎల్‌లో ఇవాళ మరో 'కీ' ఫైట్
Follow us

|

Updated on: Oct 05, 2020 | 5:46 PM

IPL 2020 RCB Vs DC : ఐపీఎల్‌లో ఇవాళ మరో కీలక పోరు జరుగనుంది. దుబాయ్‌ వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడబోతున్నాయి. ఇప్పటికే ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలిచిన కోహ్లీ సేన పాయింట్స్ టేబుల్లో మూడో స్థానంలో ఉండగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి రెండవ స్థానంలో కొనసాగుతోంది.

వరుస విజయాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మంచి జోరు మీదుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడం RCBకి కలిసొచ్చే అంశం. ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. మరో ఓపెనర్ ఫించ్ కూడా బ్యాట్‌కు పనిచెప్తే బెంగళూరు స్కోర్‌ 200 దాటడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్ విభాగంలో ఇసురు ఉదాన, సైనీ, చాహల్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్ విభాగం కూడా మంచి ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ టాప్‌ ఆర్డర్‌, మిడిలార్టర్ మంచి ఫామ్‌లో ఉంది. దీంతో ప్రత్యర్థి బౌలర్లు వికెట్లు తీసేందుకు శ్రమిస్తున్నారు. బౌలింగ్‌లో రబాడా, నోక్యా రాణిస్తున్నారు. గాయం నుంచి కోలుకోని తిరిగి జట్టులోకి వచ్చిన అశ్విన్‌ కోల్‌కతాతో మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేదు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌ ఉన్న బెంగళూరుపై తాము పైచేయి సాధిస్తామని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్‌ నోక్యా ధీమా వ్యక్తం చేశాడు. అయితే మంచి ఫామ్‌లో ఉన్న జట్టుకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఆ జట్టులో మోస్ట్ డిపెండబుల్ బౌలర్‌గా భావిస్తున్న లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గాయంతో మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఢిల్లీ కేపిటల్స్ అధికారికంగా ప్రకటించింది.

లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా గత శనివారం షార్జాలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. బంతిని అందుకునే క్రమంలో బౌలింగ్ వేళ్ళలోని నరాలు దెబ్బతిన్నాయి. ఆదివారం అమిత్ మిశ్రాకు స్కానింగ్ నిర్వహించామని నరాలు దెబ్బతినడంతో కొంతకాలం పాటు మిశ్రా బౌలింగ్ చేయలేడని వైద్యులు తెలిపారని ఢిల్లీ కేపిటల్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు.