Viral news: చనిపోయిన భర్త మళ్లీ పుట్టాడంటూ ఆవును మనువాడిన మహిళ.. కంబోడియాలో షాకింగ్‌ ఘటన..

మన దేశంలో ఆవును ఓ జంతువులా కాకుండా సొంత మనిషిలా భావిస్తారు. పూజలు కూడా చేస్తారు. ఇక పునర్జన్మలకు సంబంధించి మన దేశంతో

Viral news: చనిపోయిన భర్త మళ్లీ పుట్టాడంటూ ఆవును మనువాడిన మహిళ.. కంబోడియాలో షాకింగ్‌ ఘటన..

మన దేశంలో ఆవును ఓ జంతువులా కాకుండా సొంత మనిషిలా భావిస్తారు. పూజలు కూడా చేస్తారు. ఇక పునర్జన్మలకు సంబంధించి మన దేశంతో పాటు విదేశాల్లోనూ ఎన్నో నమ్మకాలు, విశ్వాసాలు ఉన్నాయి. అయితే చనిపోయిన వారు మళ్లీ తిరిగిపుడతారని శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవు. ఇదంతా పక్కన పెడితే.. కంబోడియాలో ఒక 74 ఏళ్ల వృద్ధురాలు చనిపోయిన తన భర్తే మళ్లీ తిరిగొచ్చాడంటూ ఒక ఆవును మనువాడింది. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కంబోడియాలోని క్రతి ప్రావిన్స్‌కు చెందిన ఖిమ్ హాంగ్ వయసు 74 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు. కొన్నేళ్ల క్రితమే ఆమె భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. అయితే ఇటీవల ఖిమ్ హాంగ్ తన పెంపుడు ఆవుతో కలిసి పెళ్లిపీటలెక్కి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఆ మహిళ ఆవును పెళ్లి చేసుకుందనడానికి వీడియో గానీ.. ఫొటో ఆధారాలు గానీ లేవు. కానీ స్థానికులు మాత్రం వారిద్దరు పెళ్లి చేసుకున్నారని, తమ సమక్షంలోనే ఆ పెళ్లి తంతు జరిగిందని చెబుతున్నారు.

ఆవులో నా భర్త కనిపిస్తున్నారు.. భర్త చనిపోయాక ఇంట్లో ఎక్కువ సమయం ఆవుతోనే ఉండేది ఖిమ్ హాంగ్. దానిని ఎంతో ప్రేమగా చూసుకునేది . అలా ఆ ఆవు కూడా ఆమెకు దగ్గరయింది. ఖిమ్ దగ్గరికి రాగానే చేతిని, నుదిటిని నాలుకతో నాకేది. దీంతో తన భర్త చూపించినట్లుగానే ఆవు కూడా తనపై ఎంతో ప్రేమ చూపిస్తోందని, ఆయనే ఆవు రూపంలో మళ్లీ వచ్చాడని..అందుకే పెళ్లి చేసుకున్నానని ఖిమ్ హాంగ్ చెబుతోంది. ‘అందరికీ అది ఆవులా కనిపించవచ్చు కానీ.. నాకు మాత్రం ఆ మూగజీవిలో నా భర్త కనిపిస్తున్నాడు’ అని అంటోంది ఖిమ్‌ హాంగ్‌. ప్రస్తుతం ఆవుకు కూడా తన ఇంట్లో స్థానం కల్పించింది. దాంతో పాటే ఆమె నిద్రపోతుంది. పడుకునేందుకు దిండు, పరుపు కూడా ఇస్తుంది. ఇక ఖిమ్ హాంగ్‌కు ఉన్న ఇద్దరు కుమారులకు కూడా ఆవే మీ తండ్రి అని చెప్పడంతో.. వారు కూడా అదే నమ్ముతున్నారు. ఒకవేళ తాను కన్నుమూస్తే ఆవును నిర్లక్ష్యం చేయవద్దని, కన్నతండ్రిలా చూసుకోవాలని పిల్లలకు చెబుతోంది ఖిమ్‌. దానిని ఎప్పటికీ ఎవరికీ అమ్మకూడదంటోంది. అదేవిధంగా ఆవు చనిపోతే.. మనుషలకు జరిపినట్లుగానే అంతిమ సంస్కారాలు నిర్వహించాలని ఇప్పటి నుంచే కుమారులకు చెబుతోంది. కాగా కొన్ని రోజుల క్రితం లండన్‌కు చెందిన ఓ మహిళ తన భర్తకు విడాలకులిచ్చి పెంపుడు కుక్కను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

Also Read:

Viral Video: మరీ ఇంత వరెస్ట్‌గా తయారయ్యారు ఏంట్రా బాబు.. కోడిగుడ్ల దొంగతనం

Viral News: బ్రేకప్ తర్వాత తానిచ్చిన డబ్బు ఇచ్చేమన్న యువతి.. దీంతో మాజీ లవర్ షాక్ ఇచ్చాడు

Viral Video: మందుబాబులకు ఆగ్రహం తెప్పించిన కుదురులేని కుక్క.. ఫన్నీ వీడియో వైరల్..

Published On - 5:46 pm, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Telugu