‘బాబ్బాబూ ! నాకూ ఫుడ్ కావాలి’, కాళ్ళతో తడుతూ..

'బాబ్బాబూ ! నాకూ ఫుడ్ కావాలి', కాళ్ళతో తడుతూ..

ఆకలి గొన్న ఓ సీల్ తన కేర్ టేకర్ ని అదేపనిగా ఫుడ్ కోసం ప్రాధేయపడుతున్న ఓ వీడియోను ఐ ఎఫ్ ఎస్ అధికారి సుశాంత్ నందా రిలీజ్ చేశారు. 'హలో సర్ ! ఐ యాం హియర్ టూ'..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Aug 11, 2020 | 3:37 PM

ఆకలి గొన్న ఓ సీల్ తన కేర్ టేకర్ ని అదేపనిగా ఫుడ్ కోసం ప్రాధేయపడుతున్న ఓ వీడియోను ఐ ఎఫ్ ఎస్ అధికారి సుశాంత్ నందా రిలీజ్ చేశారు. ‘హలో సర్ ! ఐ యాం హియర్ టూ’ (సర్ ! నేనూ ఇక్కడ ఉన్నాను) అనే క్యాప్షన్ తో  రిలీజైన ఈ వీడియో హృదయాన్ని కదిలించేదిగా ఉంది. తనకూ ఆహారం కావాలంటూ ఆ సీల్ తన కాళ్లతో అతని కాళ్ళను తడుతుంటే ఆ వ్యక్తి పట్టించుకోకుండా ఇతర సీల్స్ కి తన బకెట్ నుంచి ఫుడ్ వేయడం గమనార్హం. సముద్ర ప్రాంతాల్లోని సీల్ జీవుల కోసం ప్రత్యేకంగా ఉన్న ఓ జూ వంటి చోట ఈ క్లిప్ తీసినట్టు కనిపిస్తోంది.

ఆ వ్యక్తి దీని ‘మొర’ ను పట్టించుకోని నిర్లక్ష్యాన్ని పలువురు నెటిజన్లు తప్పు పడుతున్నారు. అచ్ఛు మనిషి లాగే ఆ నోరులేని జీవి ప్రాధేయపడుతున్నా అతగానికి ఏ మాత్రం కనికరం లేదని వారు దుయ్యబడుతున్నారు. ఈ వీడియో పలువురిని కదిలించింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu