చేతులెత్తేసిన డాక్టర్.. కుమార్తె ‘మెర్సీ కిల్లింగ్‌’కు తల్లి అభ్యర్థన

ఆరోగ్యంగా పుట్టిన ఆ బిడ్డ నాలుగేళ్ల వయస్సులో అరుదైన మానసిక వ్యాధి బారిన పడింది. అయితే ఎలాగైనా ఆ చిన్నారికి రక్షించుకోవాలని పరితపించిన తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడకుండా చికిత్స చేయిస్తూ వచ్చారు. ఇది ఇలా ఉన్న సమయంలోనే ఆ చిన్నారి విషయంలో వారితో విధి మరోసారి వింత నాటకం ఆడింది. ఎనిమిదేళ్ల వయసులో ఆ చిన్నారికి గైనిక్ పరమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆ తల్లిదండ్రుల ఆశలు మరింత ఆవిరయ్యాయి. కానీ పేగు బంధం కదా.. […]

చేతులెత్తేసిన డాక్టర్.. కుమార్తె ‘మెర్సీ కిల్లింగ్‌’కు తల్లి అభ్యర్థన
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 1:20 PM

ఆరోగ్యంగా పుట్టిన ఆ బిడ్డ నాలుగేళ్ల వయస్సులో అరుదైన మానసిక వ్యాధి బారిన పడింది. అయితే ఎలాగైనా ఆ చిన్నారికి రక్షించుకోవాలని పరితపించిన తల్లిదండ్రులు ఖర్చుకు వెనుకాడకుండా చికిత్స చేయిస్తూ వచ్చారు. ఇది ఇలా ఉన్న సమయంలోనే ఆ చిన్నారి విషయంలో వారితో విధి మరోసారి వింత నాటకం ఆడింది. ఎనిమిదేళ్ల వయసులో ఆ చిన్నారికి గైనిక్ పరమైన ఆరోగ్య సమస్యలు వచ్చాయి. దీంతో ఆ తల్లిదండ్రుల ఆశలు మరింత ఆవిరయ్యాయి. కానీ పేగు బంధం కదా.. అందుకే తమ చిన్నారిని వదలుకోలేకపోయారు. గత 19ఏళ్లుగా ఆ అమ్మాయికి చికిత్స అందిస్తూ.. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి చికిత్స అందించేందుకు డాక్టర్ నిరాకరించింది. దీంతో చేసేదేమీలేక మెర్సీ కిల్లింగ్‌కు అనుమతించాలంటూ గవర్నర్‌ను అభ్యర్థించింది తల్లి స్వర్ణలత. అందరినీ కలిచివేస్తోన్న ఈ సంఘటన మన తెలుగు రాష్ట్రంలోనే చోటు చేసుకోవడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలో సింగ్ నగర్ కు చెందిన గోరిపర్తి హచ్ మెన్, స్వర్ణలతలకు 2000 సంవత్సరంలో జాహ్నవి జన్మించింది. నాలుగేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆ చిన్నారికి అరుదైన మల్టీ లొకేటెడ్ హైడ్రో కెపాలస్ అనే వ్యాధి వచ్చింది. దీని ద్వారా వంద శాతం మానసిక అంగవైకల్యం ఏర్పడింది. ఆ తరువాత ఎనిమిదేళ్లకే జాహ్నవికి గైనిక్ పరమైన సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇక విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో హచ్‌మన్ ఓ చిరుద్యోగం చేస్తుండగా.. అదే ఆసుపత్రిలో జాహ్నవిని చేర్పించి గైనిక్ విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉంటే 2017లో అదే విభాగానికి మహిళా వైద్యురాలు హెడ్ ఆఫ్ ది డిపార్టమెంట్‌గా వచ్చారు. జాహ్నవికి చికిత్స అందించేందుకు నిరాకరించారు.

దీంతో స్వర్ణలత కోర్టుకు వెళ్లి తన పరిస్థితిని వివరించింది. తన కుమార్తెకు చికిత్స కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించింది. కోర్టు సైతం సానుకూలంగా స్పందించి.. చికిత్స అందించాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను సైతం డాక్టర్లు పట్టించుకోలేదని స్వర్ణలత ఆరోపిస్తోంది. దీంతో ఇంట్లో కుమార్తెను ఉంచుకోలేదక బయట ప్రైవేట్ వైద్యం అందించకలేక సతమతం అవుతున్నారు. ఈ నేపథ్యంలో మెర్సీ కిల్లింగ్‌కు వెళ్లటం మినహా మరో మార్గం లేదని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే మెర్సీ కిల్లింగ్‌కు అనుమతిని ఇవ్వాలంటూ వారు గవర్నర్‌కు విఙ్ఞప్తి చేశారు. కాగా స్వర్ణలత చేసుకున్న అభ్యర్థన స్థానికంగా సంచలనంగా మారింది.

సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..