విజయ్ మాల్యాకు మళ్ళీ చుక్కెదురు.. ఇక ఇండియాకు అప్పగింత తప్పదా ?

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మళ్ళీ చుక్కెదురైంది. తనను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం లండన్ కోర్టులో పెట్టిన  పిటిషన్ ను సవాలు చేస్తూ ఆయన అక్కడి హైకోర్టులో అప్పీలు దాఖలు చేయగా కోర్టు దాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫ్రాడ్ చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ఆ అప్పీలును కోర్టు కొట్టివేసింది. అయితే ఆ ఉత్తర్వులను కూడా వ్యతిరేకిస్తూ మాల్యా బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీలు వేయడానికి ఆ దేశ అనుమతిని కోరారు. అయితే ఆయనకు అనుమతి […]

విజయ్ మాల్యాకు మళ్ళీ చుక్కెదురు.. ఇక ఇండియాకు అప్పగింత తప్పదా ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 14, 2020 | 6:36 PM

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మళ్ళీ చుక్కెదురైంది. తనను అప్పగించాలంటూ భారత ప్రభుత్వం లండన్ కోర్టులో పెట్టిన  పిటిషన్ ను సవాలు చేస్తూ ఆయన అక్కడి హైకోర్టులో అప్పీలు దాఖలు చేయగా కోర్టు దాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఆయన ఫ్రాడ్ చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ఆ అప్పీలును కోర్టు కొట్టివేసింది. అయితే ఆ ఉత్తర్వులను కూడా వ్యతిరేకిస్తూ మాల్యా బ్రిటన్ సుప్రీంకోర్టులో అప్పీలు వేయడానికి ఆ దేశ అనుమతిని కోరారు. అయితే ఆయనకు అనుమతి లభించలేదు.  భారత్-బ్రిటన్ అప్పగింత ఒప్పందం కింద బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఇక ఆయనను 28 రోజుల్లోగా ఇండియాకు అప్పగించాలన్న కోర్టు ఆర్డర్ ను సర్టిఫై చేసే సూచనలు ఉన్నట్టు తెలుస్తోంది.

ఇండియాలో బ్యాంకులకు సుమారు తొమ్మిది వేల కోట్లు ఎగగొట్టి లండన్ పారిపోయిన విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వంతో బాటు సీబీఐ, ఈడీ కూడా కోరుతున్నాయి. ఆయన అప్పగింత ఇక ఖరారైనట్టేనని  యుకె లోని భారత లా ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీ కి చెందిన ఒక అధికారి తెలిపారు.