క్రేజీ కాంబినేషన్ నుంచి అప్‏డేట్.. విజయ్ ఫస్ట్‏లుక్ విడుదల‏కు టైం ఫిక్స్ చేసిన పూరీ టీం..

క్రేజీ కాంబినేషన్ నుంచి అప్‏డేట్.. విజయ్ ఫస్ట్‏లుక్ విడుదల‏కు టైం ఫిక్స్ చేసిన పూరీ టీం..

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ అండ్ స్టైలిస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‏లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిందే. ఇటీవల

Rajitha Chanti

|

Jan 17, 2021 | 12:57 PM

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. మాస్ అండ్ స్టైలిస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‏లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిందే. ఇటీవల ఎనర్జిక్ స్టార్ రామ్‏తో ఇస్మార్ట్ శంకర్ సినిమా తీసి భారీ విజయాన్ని అందుకున్నాడు ఈ మాస్ డైరెక్టర్. ఆ తర్వాత విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లుగా అనౌన్స్ చేశాడు. అయితే కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్ తాత్కలికంగా ఆగిపోయిన.. ఇటీవలే తిరిగి చిత్రీకరణ ప్రారంభించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్‏డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానులు భారీగానే అంచనాలు పెంచుకున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‏ను అనౌన్స్ చేయనున్నట్లు చిత్రయూనిట్ తన ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. అయితే బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టైటిల్‏ను జనవరి 18 ఉదయం 10 గంటల 8 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా పూరీ కనెక్ట్స్ ట్వీట్ చేసింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

Also Read:  దళపతి ఫ్యాన్స్‌కు దీపావళి సర్‌ప్రైజ్.. ‘మాస్టర్’ టీజర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu