Luxery Auto: ఒక ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. తన ఆటోలో కస్టమర్లను ఆకర్షించేందుకు లగ్జరీ కార్లలో సైతం లభించని సౌకర్యాలు కల్పించాడు. మెట్రో ట్రైన్లో కూడా ఇలాంటి సౌకర్యాలు లభించవంటే నమ్మండి. అవును అతని ఆటో ఎక్కిన వాళ్ళుకూడా అదే చెబుతారు. ఎందుకంటే అతని ఆటోలో కస్టమర్ల కోసం ఫ్రీ వైఫై, టీవీ, ల్యాబ్, ల్యాప్‌లాప్, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ ఇలా సామాన్యుడినుంచి బిజినెస్ మెన్ వరకూ అందరికీ ఉపయోగపడే సదుపాయాలు కల్పించాడు. అతని ఆటోలో ప్రయాణించినంతసేపు… ఎవరి అవసరాలకు వీలుగా వారు వాటిని వినియోగించుకోవచ్చు. అంతేకాదండోయో మధ్యలో ఆకలేస్తే తినడానికి స్నాక్స్ కూడా ఏర్పాటు చేశాడు… ఇది కదండీ ఐడియా అంటే.. బిజినెస్ చేయాలంటే డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నాడు చెన్నైకి చెందిన అన్నాదురై అనే ఈ ఆటో డ్రైవర్.
మనిషిని ముందుకు నడిపించేది ఆశ . ఆ ఆశకు హార్డ్ వర్క్‌తో మిళితం చేసినప్పుడు అది విజయానికి దారితీస్తుంది. ఈ స్పూర్తి పంక్తులు వినడానికి బాగున్నాయని అనుకునేవారికి అన్నా దురై స్పూర్తిగా నిలుస్తాడు. ఆటో-రిక్షా డ్రైవర్ అన్నా దురై వ్యాపారవేత్త అవ్వాలని కలలు కనేవాడు. అయితే పేదరికంగా కారణంగా అతని తల్లిదండ్రులు మంచి విద్యను అందించలేకపోయారు. దీంతో తన తల రాతను తానే మార్చుకోవాలనుకున్నాడు.
View this post on Instagram
Also Read: మంచు దుప్పటి కప్పుకున్న సహారా ఎడారి.. వీడియో వైరల్..