మైనారిటీ నేతకు ఉపరాష్ట్రపతి ఫోన్.. ఏమని హెచ్చరించారో తెలుసా?

మైనారిటీ నేతకు ఉపరాష్ట్రపతి ఫోన్.. ఏమని హెచ్చరించారో తెలుసా?

ఆయనో జిల్లా స్థాయి నాయకుడు. అది కూడా మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకు స్వయానా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి ఉపరాష్ట్రపతి స్థాయి అత్యున్నత వ్యక్తి...

Rajesh Sharma

| Edited By: Pardhasaradhi Peri

Apr 14, 2020 | 7:03 PM

ఆయనో జిల్లా స్థాయి నాయకుడు. అది కూడా మైనారిటీ వర్గానికి చెందిన నాయకుడు. ఆయనకు స్వయానా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి ఉపరాష్ట్రపతి స్థాయి నాయకుడు తనకు ఫోన్ చేయడంతో సదరు మైనారిటీ నాయకుడు షాక్‌కు గురయ్యాడు.

భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సొంత జిల్లా ఏపీలోని నెల్లూరు అని అందరికీ తెలిసిందే. జాతీయస్థాయినేతగా ఎదిగినప్పటికీ వెంకయ్యనాయుడుకు సొంత జిల్లా అంటే ఎక్కడ లేని అభిమానం. దేశ, విదేశాలలో ఎక్కడ వున్నా.. ఆయన సొంత జిల్లా పరిణామాలను తెలుసుకుంటూనే వుంటారు. వీలైనంతగా సొంత జిల్లా వాసులకు చేయూత నందిస్తూనే వుంటారు. ఈక్రమంలోనే ఆయన మంగళవారం మధ్యాహ్నం నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మైనారిటీ నేతకు ఫోన్ చేసి మాట్లాడారు.

నెల్లూరు నగర మాజీ మేయర్, మైనారిటీ నేత అబ్దుల్ ఆజీజ్‌కు వెంకయ్యనాయుడు కాల్ చేశారు. నెల్లూరు జిల్లాలో నెలకొన్న కరోనా స్థితి గతులను వాకబు చేశారు. ఏపీలో కరోనా విస్తృతి అధికంగా వున్న జిల్లాల్లో నెల్లూరు ఒకటా కాగా.. ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి నిలకడగానే వుంది. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం వున్న కరోనా పరిస్థితులపై ఉపరాష్ట్రపతి ఆరా తీశారు. అయితే చివరగా ఆయన ఆ మైనారిటీ నేతకు చిన్నగా వార్నింగ్ ఇచ్చారు. ఏ మాత్రం అనుమానం వున్నా ప్రతీ ఒక్కరికీ కరోనా పరీక్షలు చేయించాలని ఆయన సూచించారు. ఎవరికి వారు ఇలా తప్పించుకుంటే భవిష్యత్తులో కరోనా వైరస్‌ను నియంత్రించలేని దశకు దేశం చేరుకుంటుందని, అప్పుడు ఎవరిని నిందించినా ఫలితం వుండదని వెంకయ్యనాయుడు హెచ్చరించారు.

కరోనా పరీక్షలు చేయించుకుంటే ఎలాంటి నష్టం వుండదని, ఒకవేళ పాజిటివ్‌గా తేలినా నిర్ణీత సమయం ఐసోలేషన్‌లో వుండి, ఆ తర్వాత క్వారెంటైన్ షిప్టు అయి.. ఆ తర్వాత సామాన్య జీవనం గడపవచ్చని వెంకయ్య మైనారిటీ నేతకు వివరించారు. అదే సమయంలో పరీక్షలకు వెరచి అలాగే వుండిపోతే.. కరోనా వ్యాప్తిని ఎవరూ నియంత్రించలేరని, అది మొత్తం దేశానికి శాపంగా మారే ప్రమాదం వుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu