తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రాజెక్టులపై.. కేంద్రమంత్రికి ఉపరాష్ట్రపతి ఆదేశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయుష్ గోయల్‌కు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర మంత్రితోపాటు వాణిజ్య శాఖ కార్యదర్శి, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనితీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్టణం-చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ పనుల గురించి, కాకినాడలో ఏర్పాటుచేయ […]

తెలుగు రాష్ట్రాల్లో పారిశ్రామిక ప్రాజెక్టులపై.. కేంద్రమంత్రికి ఉపరాష్ట్రపతి ఆదేశం
Follow us

| Edited By:

Updated on: Feb 14, 2020 | 6:45 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రతిపాదించిన పరిశ్రమలు, ఇండస్ట్రియల్ కారిడార్ల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర వాణిజ్య, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయుష్ గోయల్‌కు గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. శుక్రవారం ఉపరాష్ట్రపతి నివాసంలో కేంద్ర మంత్రితోపాటు వాణిజ్య శాఖ కార్యదర్శి, భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శులతో జరిగిన సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిపాదిత ప్రాజెక్టుల పనితీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు.

విశాఖపట్టణం-చిత్తూరు మధ్య పారిశ్రామిక కారిడార్ పనుల గురించి, కాకినాడలో ఏర్పాటుచేయ సంకల్పించిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. గుంటూరులోని ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంతో సమన్వయం చేసుకుంటూ గుంటూరు జిల్లాలో స్పైస్ పార్క్ ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు.

దీంతోపాటుగా.. తెలంగాణలోని హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్, హైదరాబాద్-నాగ్‌పూర్ పారిశ్రామిక కారిడార్‌పైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల సమీపంలో ప్రతిపాదించిన ఫార్మాసిటీ అంశంపైనా ఉపరాష్ట్రపతి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న ప్రాజెక్టులకు వాటికి నిర్దేశించి సమయంలోగా పూర్తిచేయాలని ఉపరాష్ట్రపతి ఆదేశించారు.

ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో మాట్లాడి ప్రాజెక్టుల వ్యవహారంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రికి సూచించారు. దీనికి మంత్రి, రెండు శాఖల కార్యదర్శులు సమాధానమిస్తూ.. వీలైనంత త్వరగా పూర్తిచేసేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి ముందడుగేస్తామన్నారు.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు