సిద్ధార్ధ మృతి.. ‘కాఫీ డే’ ఔట్‌లెట్లు మూసివేత

ప్రముఖ వ్యాపారవేత్త, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణానికి సంతాపంగా ఆ సంస్థ యాజమాన్యం సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న కేఫ్ కాఫీ డే ఔట్‌లెట్లు మూతపడ్డాయి. కాగా నేత్రావతి నదిలోని హోగే బజార్ ప్రాంతంలో సిద్ధార్థ మృతదేహాన్ని ఇవాళ పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం వెన్‌లాక్ ఆసుపత్రికి తరలించిన వారు.. ఆ తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాయని.. ఇన్వెస్టర్లు, ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడి భరించలేకపోతున్నానని […]

సిద్ధార్ధ మృతి.. ‘కాఫీ డే’ ఔట్‌లెట్లు మూసివేత
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2019 | 10:51 AM

ప్రముఖ వ్యాపారవేత్త, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు సిద్ధార్థ మరణానికి సంతాపంగా ఆ సంస్థ యాజమాన్యం సెలవు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న కేఫ్ కాఫీ డే ఔట్‌లెట్లు మూతపడ్డాయి. కాగా నేత్రావతి నదిలోని హోగే బజార్ ప్రాంతంలో సిద్ధార్థ మృతదేహాన్ని ఇవాళ పోలీసులు గుర్తించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం వెన్‌లాక్ ఆసుపత్రికి తరలించిన వారు.. ఆ తరువాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.

అయితే వ్యాపార లావాదేవీల్లో తీవ్ర ఇబ్బందుల్లో ఇరుక్కుపోయాయని.. ఇన్వెస్టర్లు, ఆదాయపు పన్ను అధికారుల ఒత్తిడి భరించలేకపోతున్నానని లేఖ రాసిన సిద్ధార్థ తన ఇంటి నుంచి సోమవారం వెళ్లిపోయారు. తన డ్రైవర్‌తో కలిసి మంగళూరు నేత్రావతి నది వద్దకు వెళ్లిన ఆయన.. కొంచెం పని ఉందని, తాను వచ్చేవరకు అక్కడే వేచి ఉండాలని సూచించారు. ఆ తరువాత చాలా సమయం గడిచినా సిద్ధార్థ రాకపోవడంతో కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు డ్రైవర్. దీంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలించారు. దాదాపు 25మంది గజ ఈతగాళ్లు నేత్రావతి నది పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇవాళ ఆయన మృతదేహం లభ్యమైంది. కాగా కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడైన సిద్ధార్థ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కృష్ణకు అల్లుడైన విషయం తెలిసిందే.