వరుపుల రాజాపై కేసు న‌మోదు

ప్ర‌త్తిపాడు టీడీపీ మాజీ నేత‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్ వరుపుల రాజాపై పోలీసు కేసు న‌మోదైంది. గత తెలుగుదేశంలో హ‌యాంలో తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ వ్యవసాయ పరపతి సంఘంలో రైతు లోన్స్ పేరుతో

వరుపుల రాజాపై కేసు న‌మోదు
Follow us

|

Updated on: Aug 28, 2020 | 6:19 PM

ప్ర‌త్తిపాడు టీడీపీ మాజీ నేత‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్ వరుపుల రాజాపై పోలీసు కేసు న‌మోదైంది. గత తెలుగుదేశంలో హ‌యాంలో తూర్పుగోదావరి జిల్లా లంపకలోవ వ్యవసాయ పరపతి సంఘంలో రైతు లోన్స్ పేరుతో రూ. 16 కోట్ల 50 లక్షల నిధులు అవ‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు వార్త‌లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్తిపాడు శాస‌న‌స‌భ్యుడు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రస్తావించారు. దీంతో సీఎం జ‌గ‌న్ విచారణకు ఆదేశించారు. అధికారులు విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌చ్చాయి.

మ‌ర‌ణించిన‌ రైతులు పేరు మీద సోసైటీలో స్వల్పకాలిక క్రాప్ లోన్స్‌ కాజేసినట్లు గుర్తించారు. ప‌ద‌విని వాడుకుని 450 ఫేక్ పాస్ పుస్తాకాలను తయారు చేసి వాటితోను లోన్స్‌ కాజేశారు. ఈ అవినీతి అక్రమాలకు కారకులుగా వరుపుల రాజా తో పాటుగా… అప్పటి సొసైటీ ఉద్యోగులపై ఎంక్వైరీ ఆఫీస‌ర్ రాధాకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అప్పటి అధ్యక్షుడు వరుపుల రాజాతో పాటు నలుగురు మాజీ ఉద్యోగులపై ప్రత్తిపాడు పీఎస్‌లో కేసు నమోదు చేశారు.

Also Read :

సోంపేటలో 19 మంది వాలంటీర్లపై వేటు

ఈ గొర్రె రేటెంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే !