విజయమ్మను ఓడించిన వైజాగ్‌కు క్యాపిటలా? బాబు నోట సూపర్ మాట

అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు విశాఖపట్నంపై వెరైటీ కామెంట్లు చేశారు. విశాఖ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూనే అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా అక్కడ ఎవరూ ఉద్యమించడం లేదని, కనీసం మాట్లాడడం లేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. సతీమణి భువనేశ్వరి సమేతంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు మంగళవారం పర్యటిస్తున్నారు. గతంలో హూదూద్ టైంలో విశాఖపట్నంలోనే ఉండి అక్కడే ఉండి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చానని, ఒక్క పిలుపుతో విశాఖ ప్రజలంతా తనకు, తమ ప్రభుత్వానికి సహకరించారని […]

  • Rajesh Sharma
  • Publish Date - 1:48 pm, Wed, 1 January 20
విజయమ్మను ఓడించిన వైజాగ్‌కు క్యాపిటలా? బాబు నోట సూపర్ మాట

అమరావతి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు విశాఖపట్నంపై వెరైటీ కామెంట్లు చేశారు. విశాఖ అంటే తనకు ప్రత్యేక అభిమానం అంటూనే అమరావతి రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా అక్కడ ఎవరూ ఉద్యమించడం లేదని, కనీసం మాట్లాడడం లేదని చెప్పుకొచ్చారు చంద్రబాబు. సతీమణి భువనేశ్వరి సమేతంగా రాజధాని ప్రాంతంలో చంద్రబాబు మంగళవారం పర్యటిస్తున్నారు.

గతంలో హూదూద్ టైంలో విశాఖపట్నంలోనే ఉండి అక్కడే ఉండి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చానని, ఒక్క పిలుపుతో విశాఖ ప్రజలంతా తనకు, తమ ప్రభుత్వానికి సహకరించారని చంద్రబాబు అన్నారు. విశాఖలో మెరుగుపడిన పరిస్థితిని చూసి ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఆశ్చర్యపోయారని అన్నారాయన.

ఈ సందర్బంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. గతంలో విశాఖపట్నం నుంచి పోటీ చేసిన విజయమ్మను విశాఖ ప్రజలు ఓడించారని అలాంటి నగరానికి రాజధానిని తరలించాలని జగన్ చూస్తున్నారని అన్నారు చంద్రబాబు. తన వల్లే విశాఖపట్నంలో 70వేల కోట్లతో అదానీ గ్రూప్ డేటా సెంటర్ వచ్చిందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటేనే భయపడే పరిస్థితి క్రియేట్ చేశారంటూ జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.

అమరావతి ఏరియా రైతులకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు ఒక్కరు కూడా బయటకు రావడం లేదని, రాజధాని రైతులకు అన్యాయం జరగాలని విశాఖ ప్రజలు కోరుకోవడం లేదని చంద్రబాబు అన్నారు. అమరావతి ఒక పుణ్యక్షేత్రం… ఎవరైనా ఈ ప్రాంతానికి చెడు చేస్తే వారే నాశనం అయిపోతారంటూ బాబు శాపనార్థాలు పెట్టారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పర్యటనకు ఆంక్షలు విధిస్తున్నారని, గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు తమ ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఉంటే ఆయన పాదయాత్ర చేసే వారా అని ప్రశ్నించారు చంద్రబాబు.

అమరావతి 5 కోట్ల మందికి రాజధాని అని…రాష్ట్రంలో ఉండే రైతులు మొత్తం వచ్చి అమరావతి ప్రాంత రైతుల పక్షాన పోరాటం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేశామని, ప్రస్తుతం ఉద్యోగాల కోసం మళ్ళీ హైదరాబాద్, బెంగళూరు వెళ్ళాల్సిన పరిస్థితి జగన్ ప్రభుత్వం సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు.