అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు… కీలక నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్

శ్రీరామ జన్మభూమి అయోధ్య నగరంలోని విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరాం పేరు పెడుతూ ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. టెంపుల్ టౌన్ అయోధ్యలోని విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ మంత్రివర్గం నిర్ణయించింది.

అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు... కీలక నిర్ణయం తీసుకున్న యూపీ సర్కార్
Follow us

|

Updated on: Nov 25, 2020 | 10:26 AM

Maryada Purshotam Shriram Airport : రాముడి జన్మస్థలం.. సాకేత రాముడు నడయాడిన నేల.. అయోధ్యాపురి దశాబ్దాల తర్వాత అభివృద్ధి పథంలోకి దూసుకు పోతోంది. యూపీ ప్రభుత్వం ఈ నగరం అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా.. అయోధ్య నగరంలోని విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగిఆదిత్యనాథ్ నేతృత్వంలోని మంత్రివర్గం తాజాగా తీర్మానించింది.

శ్రీరామ జన్మభూమి అయోధ్య నగరంలోని విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తం శ్రీరాం పేరు పెడుతూ ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. టెంపుల్ టౌన్ అయోధ్యలోని విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెడుతూ మంత్రివర్గం నిర్ణయించింది.

అయోధ్యలో విమానాశ్రయం నిర్మాణానికి భూసేకరణ ఇప్పటికే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. భూసేకరణ పూర్తి కాగానే కేంద్ర పౌరవిమానయాన శాఖ విమానాశ్రయ నిర్మాణ పనులు చేపట్టనుంది. అయోధ్య విమానాశ్రయానికి శ్రీరాముడి పేరు పెట్టడాన్ని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు చెల్లించే మండీ ఫీజును 2 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ యోగి సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఉత్తర్ ప్రదేశ్ రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.