రాక్‌స్టార్‌ని కబలించిన క్యాన్సర్‌ మహమ్మారి

నాలుగు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రాక్‌ గిటారిస్ట్‌ ఎడ్డీ వాల్‌ హాలెన్‌ కన్నుమూశారు.. 65 ఏళ్ల ఈ సంగీత పిపాసిని కేన్సర్‌ బలిగొంది.. సుదీర్ఘ కాలంగా ఈ మహమ్మారిని జయించడానికి తీవ్రంగా ప్రయత్నించి అలసిపోయిన..

రాక్‌స్టార్‌ని కబలించిన క్యాన్సర్‌ మహమ్మారి
Balu

|

Oct 07, 2020 | 11:33 AM

నాలుగు దశాబ్దాల పాటు సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన రాక్‌ గిటారిస్ట్‌ ఎడ్డీ వాల్‌ హాలెన్‌ కన్నుమూశారు.. 65 ఏళ్ల ఈ సంగీత పిపాసిని కేన్సర్‌ బలిగొంది.. సుదీర్ఘ కాలంగా ఈ మహమ్మారిని జయించడానికి తీవ్రంగా ప్రయత్నించి అలసిపోయిన హాలెన్‌ ఇక తనవల్ల కాదంటూ మరో లోకానికి వెళ్లిపోయారు. హాలెన్‌ పుట్టింది హాలెండ్‌లోనే అయినా పెరిగిందంతా అమెరికాలోని కాలిఫోర్నియాలోనే! హాలెన్‌ అసలు పేరు ఎడ్వర్డ్‌ లూయిస్‌.. తదనంతర కాలంలో తన మ్యూజిక్‌ గ్రూప్‌ పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు.. తన సోదరుడు అలెక్స్‌తో కలిసి 1972లో వాన్‌ హాలెన్‌ రాక్‌ మ్యూజిక్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేసిన హాలెన్‌ కొద్ది కాలంలోనే సంగీత ప్రియుల అభిమానాన్ని సంపాదించాడు. రన్నిన్‌ విత్‌ ద డెవిల్‌, ఎరప్షన్‌ ఆల్బమ్స్‌ హాలెన్‌ పేరును మారుమోగేలా చేశాయి.. హాలెన్‌ రాక్‌ గ్రూప్‌ స్వరపరచిన ఆల్బమ్స్‌ 75 మిలియన్ల వరకు అమ్ముడవ్వడం విశేషం.. అమెరికా చరిత్రలో ఇంతటి ఆదరణ మరే మ్యూజిక్‌ గ్రూప్‌కు లభించలేదు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu