అమెరికాలో టిక్ టాక్ ! రంగంలోకి దిగిన ఒరాకిల్

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలలో తాము భాగస్వాములం కాదల్చుకుంటామంటూ ఒరాకిల్ దాఖలు చేసిన బిడ్ ను తాము పరిశీలిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. ఒరాకిల్ నుంచి తమకు ఈ మేరకు ఓ ప్రతిపాదన అందిందని..

అమెరికాలో టిక్ టాక్ ! రంగంలోకి దిగిన ఒరాకిల్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 15, 2020 | 4:13 PM

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలలో తాము భాగస్వాములం కాదల్చుకుంటామంటూ ఒరాకిల్ దాఖలు చేసిన బిడ్ ను తాము పరిశీలిస్తున్నామని అమెరికా అధికారులు తెలిపారు. ఒరాకిల్ నుంచి తమకు ఈ మేరకు ఓ ప్రతిపాదన అందిందని ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్ నుచిన్ తెలిపారు.మైక్రోసాఫ్ట్ ప్రతిపాదనను టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ తోసిపుచ్చిందన్నారు. అటు-తాము ఓ ప్రపోజల్ ను ట్రెజరీ శాఖకు సమర్పించామని, మీ దేశ భద్రతకు ముప్పు తెచ్చే ఎలాంటి చర్యలకూ పాల్పడబోమని హామీనిచ్చామని టిక్ టాక్ సంస్థ కూడా వెల్లడించింది. అయితే ఈ అభ్యర్థనను, ఒరాకిల్ ప్రతిపాదనను మేం మా ప్రభుత్వ కమిటీకి నివేదించాం, జాతీయ భద్రతా వ్యవహారాలను, విదేశీ లావాదేవీలను పర్యవేక్షించే ఆ కమిటీయే దీనిపై నిర్ణయం తీసుకుంటుంది అని స్టీవెన్ నుచిన్ చెప్పారు. అమెరికాలో టిక్ టాక్ అంటే అమితంగా అభిమానించే యువత 60 శాతం పైగా ఉన్న విషయం తెలిసిందే. మొదట మైక్రోసాఫ్ట్ తాము ఈ దేశంలో ఈ చైనీస్ యాప్ ఆపరేషన్స్ ని చేపడతామని ముందుకు రాగా.. ఆ తరువాతి పరిణామాల నేపధ్య్మలో వెనక్కి తగ్గింది.