అమెరికాలో టిక్ టాక్ కి మరో వారం గడువు, పొడిగించిన ట్రంప్ ప్రభుత్వం, సస్పెన్స్ లో చైనీస్ యాప్

అమెరికాలో టిక్ టాక్ లావాదేవీల అమ్మకానికి గాను దీని మాతృక సంస్థ బైట్ డాన్స్ కు ఇఛ్చిన డెడ్ లైన్ ను ట్రంప్ ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మొదట ఈ నెల 27 వరకు గడువు ఇచ్చినప్పటికీ..

  • Publish Date - 5:34 pm, Thu, 26 November 20 Edited By: Pardhasaradhi Peri
అమెరికాలో టిక్ టాక్ కి మరో వారం గడువు, పొడిగించిన ట్రంప్ ప్రభుత్వం, సస్పెన్స్ లో చైనీస్ యాప్

అమెరికాలో టిక్ టాక్ లావాదేవీల అమ్మకానికి గాను దీని మాతృక సంస్థ బైట్ డాన్స్ కు ఇఛ్చిన డెడ్ లైన్ ను ట్రంప్ ప్రభుత్వం మరో వారం పొడిగించింది. మొదట ఈ నెల 27 వరకు గడువు ఇచ్చినప్పటికీ ఆ తరువాత దీన్ని డిసెంబరు 4 వరకు పొడిగించినట్టు ట్రెజరీ శాఖ వెల్లడించింది. యూఎస్ లో విదేశీ పెట్టుబడులపై గల కమిటీ ఈ వెసులుబాటును కల్పించింది. ఇటీవల తమకు అందిన రిపోర్టులను సమీక్షించేందుకు మరికొంత సమయం లభించేలా చూసేందుకే ఈ పొడిగింపునిచ్చినట్టు తెలుస్తోంది. ఈ యాప్ ను అడ్డుపెట్టుకుని చైనా తమ దేశంలో గూఢచర్యం నెరపుతోందని ట్రంప్ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అందువల్లే దీన్ని బ్యాన్ చేస్తామని హెచ్చరించింది. అయితే ఈ నిషేధాన్ని సవాలు చేస్తూ టిక్ టాక్ వాషింగ్టన్, పెన్సిల్వేనియా కోర్టుల్లో దావాలు వేసింది. అటు-బ్యాన్ ఎత్తివేయాలంటే అమెరికన్ ఇన్వెస్టర్లకు టిక్ టాక్ పై పెత్తనం ఉండాలని వైట్ హౌస్ అంటోంది.