ఊహించని విషాదం : తాత సమాధి తవ్వుతూ మనవడి మరణం…

వయోభారంతో చ‌నిపోయిన‌ తాత సమాధి తవ్వుతూ మనవడు హఠాన్మరణం చెందిన విషాద ఘటన ముజఫ్ఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ తో కలసి సమాధి తవ్వేందుకు వెళ్లిన మనవడు.. ఎవరైనా చనిపోవచ్చు.. మరో సమాధి తవ్వుదామని సరదాగా అన్న మాటలే నిజమయ్యాయి. గుండెల్లో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో హాస్పిట‌ల్ కి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్టు డాక్ట‌ర్లు చెప్పారు. దీంతో తాత సమాధి పక్కనే మరో సమాధి తవ్వి మనవడికి కూడా అంత్యక్రియలు నిర్వహించాల్సి వ‌చ్చింది. ముజఫ్ఫర్‌నగర్ లోని జన్‌సాత్ […]

  • Ram Naramaneni
  • Publish Date - 8:55 am, Mon, 27 April 20
ఊహించని విషాదం : తాత సమాధి తవ్వుతూ మనవడి మరణం...

వయోభారంతో చ‌నిపోయిన‌ తాత సమాధి తవ్వుతూ మనవడు హఠాన్మరణం చెందిన విషాద ఘటన ముజఫ్ఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. ఫ్రెండ్స్ తో కలసి సమాధి తవ్వేందుకు వెళ్లిన మనవడు.. ఎవరైనా చనిపోవచ్చు.. మరో సమాధి తవ్వుదామని సరదాగా అన్న మాటలే నిజమయ్యాయి. గుండెల్లో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో హాస్పిట‌ల్ కి తరలించారు. అప్పటికే అతడు చనిపోయినట్టు డాక్ట‌ర్లు చెప్పారు. దీంతో తాత సమాధి పక్కనే మరో సమాధి తవ్వి మనవడికి కూడా అంత్యక్రియలు నిర్వహించాల్సి వ‌చ్చింది.

ముజఫ్ఫర్‌నగర్ లోని జన్‌సాత్ లో నివ‌శించే మొహహ్మద్ యూసుఫ్(80) వయోభారంతో ప్రాణాలు విడిచారు. యూసుఫ్ అంత్యక్రియల కోసం ఆయన మనవడు సలీం(40) అతని ఫ్రెండ్స్ తో కలసి సమాధి తవ్వేందుకు వెళ్లాడు. అక్కడ మాట్లాడుకుంటూ.. ఎవరైనా చనిపోవచ్చు.. పక్కనే మరో సమాధి తవ్వుదాం అంటూ ఫ్రెండ్స్ తో న‌వ్వుతూ అన్నాడు. ఆ మాట‌ల‌న్నాక‌ కాసేపటికే ఛాతీనొప్పితో అత‌ను కుప్పకూలిపోయాడు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సలీం మృతి చెందినట్లు డాక్ట‌ర్లు పేర్కొన్నారు. చనిపోయే ముందు సలీం సరదాగా అన్న మాటలను తలచుకుని అత‌ని ఫ్రెండ్స్ తీవ్రంగా కుమిలిపోయారు. సలీమ్ పండ్ల వ్యాపారం చేసేవాడని.. చాలా ఆరోగ్యంగా ఉండేవాడని ఆయన సోదరుడు బాబర్ అహ్మద్ తెలిపారు. కాగా స‌లీంకు ఐదుగురు పిల్లలని తెలుస్తోంది.