యూపీలో ఘోరం, శానిటైజర్ చల్లి జర్నలిస్ట్ సజీవ దహనం, ముగ్గురి అరెస్ట్, మరికొందరిపైనా పోలీసునిఘా

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. శానిటైజర్ చల్లి ఓ జర్నలిస్టును, అతడి స్నేహితుడిని దుండగులు సజీవ దహనం చేశారు. లక్నో కు 160 కి.మీ. దూరంలోని బలరాం పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు గ్రామ పెద్ద కుమారునితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు.

యూపీలో ఘోరం, శానిటైజర్ చల్లి జర్నలిస్ట్ సజీవ దహనం, ముగ్గురి అరెస్ట్, మరికొందరిపైనా పోలీసునిఘా
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Dec 01, 2020 | 11:23 AM

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. శానిటైజర్ చల్లి ఓ జర్నలిస్టును, అతడి స్నేహితుడిని దుండగులు సజీవ దహనం చేశారు. లక్నో కు 160 కి.మీ. దూరంలోని బలరాం పూర్ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనలో పోలీసులు గ్రామ పెద్ద కుమారునితో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. లక్నోలో ‘రాష్ట్రీయ స్వరూప్’ అనే డైలీకి వార్తలు రాసే 37 ఏళ్ళ రాకేష్ సింగ్ నిర్భీక్, తన మిత్రుడు పింటూ సాహుతో బాటు గతనెల 27 న తీవ్ర గాయాలకు గురై కనిపించాడు. కల్వరి గ్రామ వాసి అయిన రాకేష్ ఇంట్లో ఇలా వీరిద్దరినీ స్థానికులు కనుగొన్నారు. గాయాలతో సాహు మొదట మరణించగా, రాకేష్ ని హుటాహుటిన హాస్పిటల్ కి తరలించారు. అయితే లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. తన మరణానికి ముందు ఆయన.. కల్వరి గ్రామ పెద్ద, అతని కొడుకు అవినీతి గురించి వార్తలు రాసినందుకు తనపై కక్ష తీర్చుకున్నారని తెలిపాడు. వాస్తవాలను బయటపెట్టినందుకు నామీద ఇలా హత్యాయత్నం చేసారని పేర్కొన్నాడు. బాధతో విలవిలలాడుతూ రాకేష్ చెప్పిన రెండున్నర నిముషాల వీడియో సంచలనమైంది.

ఈ ఘటన జరిగిన 4 రోజుల అనంతరం… తాము ముగ్గురిని అరెస్టు చేశామని, మరికొందరి కోసం గాలిస్తున్నామని తెలిపారు. వీరిలో రింకు మిశ్రా అనే వ్యక్తి గ్రామ పెద్దఅక్రమ్  కొడుకని, అక్రమ్ పై మర్డర్ కేసుతో తో బాటు పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని వారు చెప్పారు. అక్రమ్ స్నేహితుడైన మరొకరికి కూడా జర్నలిస్టు హత్యతో ప్రమేయం ఉన్నట్టు తేలిందన్నారు. ఈ నేరాన్ని వీరు యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు యత్నించారని, కానీ తమ దర్యాప్తులో ఇది జంట హత్యలని వెల్లడైందని అన్నారు. ఇది ఓ కుట్ర ప్రకారం జరిగినట్టు నిర్ధారించుకున్నామన్నారు. రాకేష్ సింగ్ జర్నలిస్ట్ అన్న కసి ఈ నేరంలో ఓ భాగం కాగా-మిశ్రాకు, పింటూ సాహుకు మధ్య  ఉన్న ఓ డబ్బు చెల్లింపు వివాదం కూడా మరో భాగమని పోలీసులు తెలిపారు. నిర్భయంగా వార్తలు రాసే రాకేష్ సింగ్ ని దుండగులు తమ మొదటి టార్గెట్ చేసుకున్నారని వారు చెప్పారు. గత నెల 27 న మిశ్రాకు, సాహుకు మధ్య ఓ బార్ వద్ద ఘర్షణ జరిగిందని, బహుశా దీన్ని దృష్టిలో పెట్టుకుని సాహును కూడా హతమార్చాలని వారు నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోందని ఖాకీలు పేర్కొన్నారు. ఏమైనా ఆల్కహాలుతో కూడిన శానిటైజర్ ను చల్లి హత్యలు చేయడం తమ దర్యాప్తు  కేసులో బయటపడడం ఇదే మొదటిసారని పోలీసులు తెలిపారు.

తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్.. బ్యాకప్‌గా సచిన్ 2.0..
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఊపిరితిత్తులను శుభ్రంగా, ఆరోగ్యం ఉంచే ఆహారాలు ఇవే
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
ఓయ్ చూసుకోబడలే.! బికినీలో బస్సెక్కేసిన మహిళ.. ఈ బామ్మ రియాక్షన్!
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
నీటిలో కనిపించిన నల్లటి ఆకారం.. ఏంటని వెళ్లి చూడగా దిమ్మతిరిగింది
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అలాంటి వస్త్రాలు ధరించినందుకు క్లాస్ రూంకు అనుమతి నిరాకరణ..
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అందుకే వేసవిలో కొబ్బరి బోండం నీళ్లు తాగాలట.. ఎన్ని లాభాలో!
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్..
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
నా భర్త మరో అమ్మాయిని ప్రేమించాడు.. బాంబ్ పేల్చిన నటి స్నేహ
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
మీరు తోపులైతే.. కేవలం 15 సెకన్లలో ఇందులో గుర్రాన్ని కనిపెట్టండి..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
తెలంగాణలో జోరందుకున్న నామినేషన్ల ప్రక్రియ.. తొలిరోజు నేతల పోటీ..
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
రైల్లో జనరల్ టిక్కెట్ కావాలంటే కౌంటర్‌కే వెళ్లాలా ఏంటి..?
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
'తమను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న' అక్భరుద్దీన్ ఓవైసీ..
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
పరుగులు పెడుతున్న పసిడి.. తొలిసారి రాకార్డు స్థాయికి ధర.!
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
భారీ అగ్ని ప్రమాదం.. పేలుడు శబ్ధాలకు భయం భయంలో ప్రజలు..
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
ఏపీకి నెక్ట్స్‌ సీఎం ఎవరో చెప్పిన స్టార్ హీరో విశాల్.. వీడియో.
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
బాడీ షేమింగ్ ట్రోల్స్ పై ప్రియమణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
ట్రోల్స్‌ను దాటుకొని.. హాలీవుడ్ గడ్డపై తెలుగమ్మాయి అవంతిక ఘనత.!
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
అది ఫేక్ వీడియో.. కావాలని సర్క్యూలేట్ చేస్తున్నారు..: అమీర్ ఖాన్.
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..
పక్కా స్కెచ్.. 5 లక్షల సుపారీ.. జస్ట్‌ మిస్‌.! సల్మాన్ కేసులో..