కొలిక్కిరాని తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక..పార్టీ పెద్దలకు కత్తిమీద సాములా మారుతున్న వ్యవహారం

తెలంగాణ పీసీసీపై ఢిల్లీ పెద్దల ఎక్సర్‌సైజ్‌ కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ఆ కసరత్తు తేలేలా కనిపించడం లేదు. ఏకాభిప్రాయంతో అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎన్నుకోవడం...పార్టీ పెద్దలకు కూడా కత్తిమీద సాములాగే ఉంది. అందుకే...

కొలిక్కిరాని తెలంగాణ పీసీసీ అధ్యక్ష ఎన్నిక..పార్టీ పెద్దలకు కత్తిమీద సాములా మారుతున్న వ్యవహారం
Follow us

|

Updated on: Dec 14, 2020 | 10:20 PM

తెలంగాణ పీసీసీపై ఢిల్లీ పెద్దల ఎక్సర్‌సైజ్‌ కొలిక్కిరాలేదు. ఇప్పట్లో ఆ కసరత్తు తేలేలా కనిపించడం లేదు. ఏకాభిప్రాయంతో అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎన్నుకోవడం…పార్టీ పెద్దలకు కూడా కత్తిమీద సాములాగే ఉంది. అందుకే…నేతల రియాక్షన్స్‌ గమనిస్తూ తన పని తాను చేసుకుపోతోంది కాంగ్రెస్‌ హైకమాండ్‌.

కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధమున్న నేతలే ఆశ్చర్యపోయేలా…ఆ పార్టీలో తొలిసారి టీపీసీసీ కోసం అభిప్రాయ సేకరణ జరిగింది. ఏదో అందుబాటులో ఉన్న నలుగురు నేతలతో మాట్లాడి సరిపెట్టలేదు. నాలుగురోజులపాటు జిల్లా స్థాయి నుంచి ఏఐసీసీ పదవుల్లో ఉన్న నేతలదాకా ముఖ్యులందరితో మాట్లాడారు.

162మంది అభిప్రాయాలను తీసుకున్నారు. డొంకతిరుగుడేం లేదు..డైరెక్ట్‌ క్వశ్చన్‌. పీసీసీ చీఫ్‌ ఎవరైతే బావుంటుందో చెప్పాలని. దీంతో ఎక్కువమంది మనసులో ఏముందో ఇప్పటికే హైకమాండ్‌కో క్లారిటీ వచ్చేసింది. అయితే అసంతృప్తికి తావులేకుండా…పెనంమీంచి పొయ్యిలో పడే పరిస్థితి తెచ్చుకోకుండా జాగ్రత్తగా అడుగేస్తోంది.

తుది కసరత్తుకు మరికొంత సమయం పడుతుందంటున్నారు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్కంఠాగూర్‌. పీసీసీ ఎంపిక కసరత్తుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే డైరెక్ట్‌గా పార్టీ పెద్దలను కలుసుకోవచ్చని సూచించారు మాణిక్కం. ఈనెల 16కల్లా టీపీసీసీపై క్లారిటీ వస్తుందన్న అంచనాతో ఉన్న నేతలు టెన్షన్‌ తట్టుకోలేకపోతున్నారు.

మరోసారి సీనియర్ల అభిప్రాయం తీసుకున్నాకే పీసీసీ ప్రకటన వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు నేతలు. పార్టీ అధినేత్రిని కలిసి తమ అభిప్రాయాన్ని చెబుతామంటూనే…సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు జగ్గారెడ్డిలాంటి నేతలు. ప్రస్తుతానికి ఢిల్లీకెళ్లే ఆలోచన లేదని, పార్టీ పెద్దలు రమ్మంటే వెళ్తానంటున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

టీపీసీసీ ప్రకటన వచ్చేదాకా కొందరు నేతలకు ప్రాణం ఆగేలా లేదు. ముందే వెళ్లి పార్టీ పెద్దలను కలుసుకుని తమ వాదన వినిపించాలనుకుంటున్నారు. సోనియా, రాహుల్‌ అప్పాయింట్‌మెంట్‌ దొరికితే వెంటనే ఢిల్లీ ఫ్లైట్‌ ఎక్కేందుకు రెడీ అవుతున్నారు.