సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద కలకలం..

సినీ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద కలకలం..

టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద కలకలం రేగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు కారుతో అక్రమంగా చొరబడి మోహన్ బాబు, ఆయన కుటుంబసభ్యులను బెదిరించినట్లు తెలుస్తోంది.

Ravi Kiran

|

Aug 02, 2020 | 12:05 AM

Unknown People Entered Mohan Babu Farm House: టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంటి వద్ద కలకలం రేగింది. కొందరు గుర్తుతెలియని దుండగులు కారుతో అక్రమంగా చొరబడి మోహన్ బాబు, ఆయన కుటుంబసభ్యులను బెదిరించినట్లు తెలుస్తోంది. దీనితో మోహన్ బాబు పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ”తన ఫార్మ్‌హౌస్‌లోకి కారుతో అక్రమంగా చొరబడి బెదిరించారని.. ఇన్నోవా వెహికల్‌లో ఎంటరై బూతులు తిట్టారని మోహన్ బాబు, మంచు విష్ణు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో దృశ్యాలు రికార్డు కావడంతో ఏపీ 31 ఏఎస్ 0004నెంబర్ గల కారులో దుండగులు వచ్చినట్లు మోహన్ బాబు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది శత్రువులు చేసిన పనా లేక ఆకతాయిలు ఎవరైనా చేశారా అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read:

ఏపీలోకి వచ్చేవారికి గుడ్ న్యూస్.. ఆటోమేటిక్ ఈ-పాస్ జారీ..

ఏపీలో 396 హాట్ స్పాట్స్.. ఆ రెండు జిల్లాల్లోనే అత్యధికం..

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..

దశాబ్దాల పాటు కరోనాతో యుద్ధం చేయాల్సిందే.. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu