అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ గురించి ఆసక్తికర విషయాలు..

మెలానియా ట్రంప్‌.. ఒకప్పుడు ఓ సాధారణ మహిళ. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఎన్నో అష్టకష్టాలు పడి ఆమె ఉన్నతస్థాయికి చేరుకుంది. ట్రంప్‌ టెంపరితనాన్ని భరిస్తూ...అంచెలంచెలుగా ఎదిగింది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు. పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు...చురుగ్గా చూసే కళ్లు..అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్‌ ఒకప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్.

అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌ గురించి ఆసక్తికర విషయాలు..
Follow us

|

Updated on: Feb 23, 2020 | 9:03 PM

మెలానియా ట్రంప్‌.. ఒకప్పుడు ఓ సాధారణ మహిళ. ఇప్పుడు అమెరికా ప్రథమ మహిళ. శ్వేత సౌధానికి మహారాణి. ఎన్నో అష్టకష్టాలు పడి ఆమె ఉన్నతస్థాయికి చేరుకుంది. ట్రంప్‌ టెంపరితనాన్ని భరిస్తూ…అంచెలంచెలుగా ఎదిగింది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు. పట్టుకుచ్చులా మెరిసిపోయే జుట్టు…చురుగ్గా చూసే కళ్లు..అందానికి అందంలా ఉండే పుత్తడి బొమ్మ మెలానియా ట్రంప్‌ ఒకప్పుడు ఫ్యాషన్‌ డిజైనర్. ఆ తర్వాత సూపర్‌ మోడల్‌. మోడలింగ్‌ చేస్తూ అతి పెద్ద ప్రపంచాన్ని చూశారు. 6 భాషల్లో ఆమె అనర్గళంగా మాట్లాడగలరు. స్లొవేనియన్, ఫ్రెంచ్, సెర్బియన్, జర్మన్, ఇటాలియన్, ఇంగ్లిష్‌ భాషాల్లో ప్రావీణ్యం సంపాదించింది. కానీ ఇంగ్లీష్‌ మాతృభాష కాకపోవడంతో తన యాక్సెంట్‌ని ఎక్కడ వెటకారం చేస్తారన్న బెరుకో, సహజంగానే మితభాషి అవడమో కానీ నలుగురులోకి వచ్చి ఆమె మాట్లాడరు. ఆమె ప్రపంచం ఆమెదే.  తన కొడుకు బారన్‌లే ఆమెకు లోకం.

స్లొవేనియాలో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1970 ఏప్రిల్‌ 26న మెలానియా జన్మించారు. తండ్రి విక్టర్‌ న్వాస్‌ కారు డీలర్‌. తల్లి అమలిజా పిల్లల బట్టల్ని డిజైన్‌ చేసేవారు. అలా ఆమెకి పుట్టుకతోనే ఫ్యాషన్‌ డిజైనింగ్‌పై మక్కువ ఏర్పడింది. 16వ యేటే మోడలింగ్‌ రంగంలోకి వచ్చారు. ఇటలీలోని మిలాన్‌లో ఒక యాడ్‌ ఏజెన్సీకి మోడల్‌గా పని చేశారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చదువుతూ యూనివర్సిటీ చదువు మధ్యలో ఆపేశారు. మోడలింగ్‌ మీదనే మొత్తం దృష్టి కేంద్రీకరించారు. 22 ఏళ్లు వచ్చాక మెలానియాకు కెరీర్‌లో బ్రేక్‌ వచ్చింది. స్లొవేనియా మ్యాగజీన్‌ ‘జానా’లో ‘లుక్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. ఆ తర్వాత ఆమె వెనక్కి చూసుకోలేదు. తాను వేసుకొనే డ్రెస్‌లను తానే డిజైన్‌ చేసుకునేవారు. 2000 ఏడాదిలో బ్రిటన్‌కు చెందిన ‘జీక్యూ’ మ్యాగజీన్‌ ఫొటోలకు నగ్నంగా పోజులిచ్చారు. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ఆ చిత్రాలు బయటికొచ్చి సంచలనమయ్యాయి.

1998లో అమెరికాకు వచ్చిన మెలానియాకు ట్రంప్‌తో ఓ పార్టీలో పరిచయమైంది. అప్పటికే రెండో భార్యతో విడాకులు తీసుకోవడానికి ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారు. కొన్నేళ్లు ట్రంప్‌తో డేటింగ్‌ చేశారు. 2005లో ట్రంప్‌తో వివాహమైంది. 2006లో మెలానియాకు కొడుకు బారన్‌ పుట్టాడు. ట్రంప్‌ తెంపరితనం, అమ్మాయిలు, వ్యవహారాలు, బహిరంగంగానే వారి పట్ల అసభ్య ప్రవర్తన ఇవన్నీ మెలానియాకు నచ్చినట్టు లేవు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని మెలానియా మధ్యలోనే వదిలేశారు.

ట్రంప్‌ అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోకి మకాం మార్చినపుడూ ఆమె వెంట వెళ్లలేదు. నాడు న్యూయార్క్‌లో కొడుకు చదువు కోసం ఉండిపోయారట. 2017లో కొడుకుతో కలసి వైట్‌హౌస్‌కు మారారు. వైట్‌హౌస్‌లో వారిద్దరి పడక గదులు వేర్వేరు అంతస్తుల్లో ఉండటం వంటి బెన్నెట్‌ రాసిన ఫ్రీ మెలానియా పుస్తకంలో బయటకొచ్చి సంచలనమయ్యాయి. ఇవన్నీ పక్కన పెడితే…ఇప్పటికీ ట్రంప్‌ వెనుక ఉన్నదీ మెలానియే. ఓ వైపు కుటుంబాన్ని చూస్తూనే…ట్రంప్‌కు అన్ని విషయాల్లో సహాయకారిగా ఉంటోందట. అందుకే ట్రంప్‌ ఎక్కడికెళ్లినా…ఆమె వెంట మెలానియా ఉండాల్సిందే.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..