హైదరాబాద్‌ను వీడని వాన.. నగరంలో పరిస్థితి ఇలా ఉంది

హైదరాబాద్‌ను వీడని వాన.. నగరంలో పరిస్థితి ఇలా ఉంది

హైదరాబాద్ నగరంలో బుధవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. కోఠి, జీడిమెట్ల, మల్కాజిగిరి,ఉప్పల్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లింగంపల్లి,..

Sanjay Kasula

|

Aug 13, 2020 | 10:40 PM

Rain in Hyderabad : హైదరాబాద్ నగరంలో బుధవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. కోఠి, జీడిమెట్ల, మల్కాజిగిరి,ఉప్పల్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, లింగంపల్లి, మియాపూర్‌, సనత్‌నగర్‌, అమీర్‌పేట, బేగంపేట, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ఇలా చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.

ఈ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇటు జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఉదయం నుంచి కురుస్తున్న వానకు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ వారసిగూడ, కంటోన్మెంట్ బోయినపల్లి, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. వికారాబాద్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మోమిన్‌పేటలో చిలుకవాగు, కానల వాగులు పొంగి ప్రవహిహిస్తున్నాయి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu