రాజేంద్రనగర్‌లో దారుణం.. ఓ వ్యక్తిని వెంబడించి నడిరోడ్డుపై హతమార్చిన దుండగులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

  • Balaraju Goud
  • Publish Date - 4:44 am, Mon, 11 January 21
రాజేంద్రనగర్‌లో దారుణం.. ఓ వ్యక్తిని వెంబడించి నడిరోడ్డుపై హతమార్చిన దుండగులు

Man murdered in Rajendranagar: హైదరాబాద్ మహానగరం శివారులో దారుణం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్ హైవే పిల్లర్ నెంబర్ 248 వద్ద గుర్తు తెలియని దుండగులు.. ఓ వ్యక్తిని కత్తులతో వెంబడించి కిరాతకంగా నరికి చంపారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడ్డావారి అచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తమిళనాడు సీఎం పళనిస్వామి కీలక ప్రకటన.. కాలేజీ విద్యార్థులకు ఉచితంగా 2జీబీ డేటా కార్డులు