Underworld gangster: గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారి అరెస్ట్‌

పారిపోయిన గ్యాంగ్‌స్టర్ రవి పూజారిని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేశామని, కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.కర్ణాటకతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీ, హత్యలతో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్న పుజారి

Underworld gangster: గ్యాంగ్‌స్టర్‌ రవి పూజారి అరెస్ట్‌
Follow us

| Edited By:

Updated on: Feb 24, 2020 | 9:50 AM

Underworld gangster: పారిపోయిన గ్యాంగ్‌స్టర్ రవి పూజారిని దక్షిణాఫ్రికాలో అరెస్టు చేశామని, కర్ణాటకకు చెందిన పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. కర్ణాటకతో సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో దోపిడీ, హత్యలతో సహా అనేక కేసులలో నిందితుడిగా ఉన్న పుజారి, 15 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు, అరెస్టు చేసిన తరువాత పశ్చిమ ఆఫ్రికాలోని సెనెగల్‌కు తరలించారు. పుజారిని సోమవారం బెంగళూరుకు తీసుకొస్తారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

కర్ణాటకకు చెందిన పూజారిని సోమవారం ఉదయం నాటికి బెంగళూరుకు తీసుకువచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. ఎన్‌ఐఏ, సీబీఐ, రా కూడా దర్యాప్తులో పాలుపంచుకునే అవకాశం ఉందన్నారు. కాగా, తాను రవి పూజారిని కాదని, తన పేరు ఆంతోనీ ఫెర్నాండెస్‌ అని, తనకు బుర్కినా ఫాసో దేశ పాస్‌పోర్టు కూడా ఉందని అతను వాదించినట్టు తెలిసింది. 2009-2013లో బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌, షారూఖ్‌, అక్షయ్‌ కుమార్‌, కరణ్‌ జోహార్‌, నిర్మాతలు, పలువురు ప్రముఖ వ్యక్తులను రవి బెదిరించాడు.

పూజారికి మొదట గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ తో సంబంధం ఉంది, కాని అతను పారిపోయిన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కోసం కూడా పనిచేసినట్లు తెలుస్తోంది.