ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ రేసులో అన్‌అకాడమీ..

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ రేసులో అన్‌అకాడమీ..

ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ నుంచి 'వివో' తప్పుకోవడంతో.. బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఈ క్రమంలో కొత్త స్పాన్సర్ షిప్ రేసులో పలు దిగ్గజ సంస్థల పేర్లు వినిపిస్తున్నాయి.

Ravi Kiran

|

Aug 13, 2020 | 6:33 PM

IPL 13 Sponsorship Un Academy: ఐపీఎల్ స్పాన్సర్‌షిప్‌ నుంచి ‘వివో’ తప్పుకోవడంతో.. బీసీసీఐ కొత్త స్పాన్సర్ వేటలో పడింది. ఈ క్రమంలో కొత్త స్పాన్సర్ షిప్ రేసులో పలు దిగ్గజ సంస్థల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ లిస్టులో ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ అన్‌అకాడమీ కూడా చేరింది. ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్‌ను దక్కించుకునేందుకు అన్‌అకాడమీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం బిడ్ పేపర్లను కూడా తీసుకుంది. ఇక పతంజలీ బిడ్ వేస్తే అన్‌అకాడమీతో పోటీ పడాల్సి ఉంటుందని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఐపీఎల్ 13వ సీజన్ స్పాన్సర్‌షిప్ కోసం కోకాకోలా, బైజూస్, జియో, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు రేసులో ఉన్నాయి. అలాగే తాజాగా పతంజలీ కూడా బిడ్ వేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu