Shiv Mandir: పాకిస్థాన్‌లో పూజలను అందుకుంటున్న శివయ్య .. ఇక్కడ శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం

పాక్‌లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు నిత్యం పూజలందుకుంటున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.

Shiv Mandir: పాకిస్థాన్‌లో పూజలను అందుకుంటున్న శివయ్య .. ఇక్కడ శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం
Umarkot Shiv Mandir
Follow us

|

Updated on: May 26, 2022 | 11:15 AM

Umarkot Shiv Mandir: అఖండ భారతంలో హిందూ ధర్మం విలసిల్లింది. అనేక ప్రాంతాల్లో హిందూ దేవుళ్లు ఆలయాల్లో కొలువై భక్తులతో పూజలను అందుకుంటున్నారు. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారతదేశం..  పాకిస్తాన్‌గా విభజింపబడింది. దీంతో పాకిస్థాన్ లో కొన్ని ప్రముఖ హిందూ దేవాలయాలున్నాయి. వాటిల్లో ఒకటి పరమ శివుడికి సంబందించింది. ఇక్కడ శివయ్య పూజలందుకుంటున్నాడు.

పాకిస్తాన్‌లోని సింధ్‌ రాష్ట్రం ఉమర్‌కోట్‌లోని శివమందిరం నిత్యం శంభోశంకర స్మరణతో మార్మోగుతుంటుంది. దేశవిభజనకు ముందు అవిభక్త భారత్‌లోని సింధ్‌రాష్ట్రంతో పాటు ప్రస్తుతం పాకిస్తాన్‌లో గతంలో లక్షలాదిమంది హిందువులు నివసించేవారు. దేశ విభజన అనంతరం మెజార్టీ హిందువులు భారత్‌కు వచ్చేశారు. అయితే కొందరు మాత్రం అక్కడే ఉంటూ పాక్‌ సమాజంలో భాగమయ్యారు. ఇప్పటికీ పాక్‌లో వేలాది హిందూ దేవాలయాలు, గురుద్వారాలు నిత్యం పూజలందుకుంటున్నాయి. వాటిలో కొన్ని మాత్రమే భక్తులతో అలరారుతుండగా వేలాది కట్టడాలు కనీస సంరక్షణ లేక శిథిలావస్థకు చేరుకున్నాయి.

సింధ్‌లోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని మొదట్లో అమర్‌కోట్‌ అనేవారు. ముస్లిం పాలకుల కాలంలో ఉమర్‌కోట్‌గా మారింది. మొగల్‌పాలకుడు అక్బర్‌ ఉమర్‌కోట్‌లోనే జన్మించాడు. క్షేత్ర పురాణాల ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. కొందరు పశువుల కాపరులు తమ పశువులను ఇక్కడకు మేతకు తీసుకువచ్చేవారు. కొన్ని ఆవులు ఒక ప్రాంతానికి వెళ్లి పాలిస్తుండేవి. దీంతో ఒక ఆసక్తితో ఆవుల కాపరి ఒకరు అక్కడకు వెళ్లి పరిశీలించగా అది శివలింగమని తేలింది. దీంతో స్థానికులకు సమాచారం అందించారు.అప్పుడు స్తానికులు భక్తితో పూజలు ప్రారంభించారు. ఇక్కడ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం విశేషం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటిఉండటాన్ని గమనించవచ్చు. (Source)

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి