వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు, ఇకపై ‘హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ !

వ్యాక్సిన్  ట్రయల్స్ లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు జరుపుతుండగా...

వ్యాక్సిన్ విషయంలో మరో ముందడుగు, ఇకపై 'హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్  !
Follow us

|

Updated on: Sep 24, 2020 | 11:49 PM

వ్యాక్సిన్  ట్రయల్స్ లో భాగంగా బ్రిటన్ మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు ఆరోగ్యవంతులైన వాలంటీర్లపై ప్రయోగాలు జరుపుతుండగా, తాజాగా హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ చేయడానికి సమాయత్తమవుతుంది. ఈ ప్రక్రియ ద్వారా వ్యాక్సిన్ సమర్థతపై క్లారిటీ వస్తుందని చెబుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొనే వాలంటీర్లకు కావాలనే వైరస్ వ్యాపింపజేసి, వ్యాక్సిన్ సమర్థతను టెస్ట్ చేస్తారు. ప్రత్యేక క్వారంటైన్ వసుతుల మధ్య ఈ టెస్టులు జరుపనున్నారు. లండన్ లో జరిగే ఈ ప్రయోగాల్లో దాదాపు 2 వేల మంది పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రయోగాలపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఈ ట్రయల్స్ లో ఏ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ టెస్ట్ చేస్తున్నారో ఇంకా తెలియరాలేదు. హ్యూమన్ ఛాలెంజ్ ట్రయల్స్ పై  ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య నిపుణుల నుంచి భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read :

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం

శ్రీశైలంలోని ఘంటా మఠంలో మరో అద్భుతం