అరుణ గ్రహంపై అన్వేషణ…జపాన్ నుంచి ఎగసిన యుఏఈ ఉపగ్రహం

అంగారక గ్రహంపై అన్వేషణకు గల్ఫ్ దేశాల కూటమి..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) కూడా శ్రీకారం చుట్టింది. ఈ కూటమి రూపొందించిన రాకెట్.. "హాప్" జపాన్ లోని టనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి..

అరుణ గ్రహంపై అన్వేషణ...జపాన్ నుంచి ఎగసిన యుఏఈ ఉపగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 20, 2020 | 11:32 AM

అంగారక గ్రహంపై అన్వేషణకు గల్ఫ్ దేశాల కూటమి..యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఈ) కూడా శ్రీకారం చుట్టింది. ఈ కూటమి రూపొందించిన రాకెట్.. “హాప్” జపాన్ లోని టనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి ఎగసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 6 గంటల 58 నిముషాలకు దీన్ని ప్రయోగించారు. అరుణ గ్రహంపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు తామీ ప్రయోగాన్ని చేపట్టినట్టు  యూఏఈ వర్గాలు వెల్లడించాయి. అరబిక్ లో ఈ రాకెట్ లాంచ్ ని ‘అల్-అమల్’ అని వ్యవహరిస్తారట. గతంలోనే రెండు సార్లు ఈ మిషన్ ని చేపట్టదలచినప్పటికీ వాతావరణం బాగు లేనందున వాయిదా వేశారు. ఈ మిషన్ విజయవంతమైందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రయోగం జరిగిన గంట అనంతరం ఇది సక్సెస్ అయినట్టు జపాన్ లోని కంట్రోల్ రూమ్ లో ఉన్న శాస్త్రవేత్తలంతా  ప్రకటించి హర్షాతిరేకంతో చప్పట్లు కొట్టారు. దుబాయ్ లోనూ ఇదే ‘సంబర వాతావరణం’ కనిపించింది. ఇక్కడి ఎత్తయిన  బుర్జ్ ఖలీఫా కట్టడంపై పది సెకండ్లపాటు దేదీప్యమానంగా .. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా లైట్ల కాంతులు విరజిమ్మాయి. వచ్ఛే ఏడాది ఫిబ్రవరి నాటికి ఈ ఉపగ్రహం మార్స్ కక్ష్యలోకి చేరవచ్ఛునని  భావిస్తున్నారు.  ఏడు ఎమిరేట్లతో కూడిన యుఎఈ ఏర్పడి ఆ నెలకు 50 సంవత్సరాలవుతుంది.

ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా

రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు

మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు