సమైక్య రాష్ట్రం మళ్లీ సిద్దిస్తుంది .. జైరాం రమేశ్ జోస్యం

ఎన్నో పోరాటాల తర్వాత విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా? లేక మళ్లీ కలవనున్నాయా? అసలు కలిసే వీలుందా? ఇదేం ప్రశ్న అనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోందని.. ఈ కష్టాలు తీరాలంటే మళ్లీ కలిసిపోవాలంటున్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్నకేసీఆర్ ఉన్నంతకాలం అది సాధ్యం కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రెండు రాష్ట్రాలను ఒక్కటిగా […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:44 am, Wed, 31 July 19
సమైక్య రాష్ట్రం మళ్లీ సిద్దిస్తుంది .. జైరాం రమేశ్ జోస్యం

ఎన్నో పోరాటాల తర్వాత విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా? లేక మళ్లీ కలవనున్నాయా? అసలు కలిసే వీలుందా? ఇదేం ప్రశ్న అనుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోవడంతో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటోందని.. ఈ కష్టాలు తీరాలంటే మళ్లీ కలిసిపోవాలంటున్నారు. ప్రస్తుతం సీఎంగా ఉన్నకేసీఆర్ ఉన్నంతకాలం అది సాధ్యం కాకపోవచ్చు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ రెండు రాష్ట్రాలను ఒక్కటిగా చేయగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీనికి ఉదాహరణగా.. రెండుగా విడిపోయిన జర్మనీ దేశాలు ఎన్నో ఏళ్ల తర్వాత ఒక్కటిగా ఏర్పడ్డాయని, అదే విధంగా ఉత్తర, దక్షిణ కొరియాలు కూడా ఒక్కటిగా మారే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చెబుతున్నారు. ఇక సమీప భవిష్యత్తులో మళ్లీ సమైఖ్య రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని బలంగా చెబుతున్నారు జైరాం రమేశ్. తన జీవితకాలంలోనే రెండుగా విడిపోయిన తెలుగురాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రంగా అవతరించడాన్ని చూస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.

జైరాం రమేశ్.. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన కాంగ్రెస్ నేత. విభజన చట్టాన్ని రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించారు. అయితే ఆయన చెప్పిన జర్మనీ అంశాన్ని అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా గతంలోనే ప్రస్తావించారు.