తెలంగాణలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు..

తెలంగాణలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు తెలిపారు.

తెలంగాణలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు..
Follow us

|

Updated on: Aug 14, 2020 | 7:09 PM

Rain Alert In Telangana: తెలంగాణలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు తెలిపారు. ఉత్తర కోస్తా, ఒరిస్సా, గ్యాంగేటిక్ పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణీ ప్రభావంతో పాటు.. 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందన్నారు. దీనితో రాగల 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని తెలిపారు.

అలాగే భారతదేశం మీదుగా 5.8 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య ఏర్పడిన తూర్పు- పశ్చిమ షేర్ జోన్ కారణంగా ఈ రోజు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి వర్షాలు పడతాయని ఆయన అన్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్ ,కొమురం భీం- ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ ,జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ ,జయశంకర్ భూపాలపల్లి ,ములుగు, వరంగల్ పట్టణ, గ్రామీణ, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ ,సూర్యాపేట జిల్లాల్లో ఈరోజు, రేపులో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు స్పష్టం చేశారు.

Also Read:

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కరోనా సమాచారానికి హెల్ప్‌లైన్‌..

జేఎన్టీయూ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 16 నుంచి ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు.!

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ‘జగనన్న విద్యా కానుక’..

కరోనాపై షాకింగ్ న్యూస్.. 16 అడుగుల వరకు వైరస్ వ్యాప్తి.!

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..