రెండు లక్షల మంది లోన్‌ యాప్ బాధితులు..వేధింపులపై తమిళనాడులో కేసులు..ఇద్దరు చైనీయుల అరెస్ట్

దాడులు కొనసాగుతున్నా.. అరెస్ట్ చేస్తున్నా.. లోన్‌యాప్‌లో ఆగడాలు ఆగడం లేదు. వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యధావిధిగా టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఆన్‌లైన్ లోన్‌యాప్స్ వేధింపులపై..

రెండు లక్షల మంది లోన్‌ యాప్ బాధితులు..వేధింపులపై తమిళనాడులో కేసులు..ఇద్దరు చైనీయుల అరెస్ట్
Follow us

|

Updated on: Jan 03, 2021 | 12:38 PM

Two Chinese arrested : దాడులు కొనసాగుతున్నా.. అరెస్ట్ చేస్తున్నా.. లోన్‌యాప్‌లో ఆగడాలు ఆగడం లేదు. వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. యధావిధిగా టార్చర్ పెడుతూనే ఉన్నారు. ఆన్‌లైన్ లోన్‌యాప్స్ వేధింపులపై తమిళనాడులో నమోదవుతున్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టారు అక్కడి పోలీసులు.

రెండు లక్షల మంది లోన్‌ యాప్ బాధితులు ఉన్నట్లు గుర్తించారు. బెంగళూరు కేంద్రంగా చెన్నెైలో మనీ యాప్స్ నిర్వహిస్తున్న గ్యాంగ్‌ను బెంగళూరులో అరెస్ట్ చేశారు. అరెస్టైయిన నలుగురిలో ఇద్దరు చైనీయులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

లోన్‌ యాప్ నిర్వాహకుల ఆగడాలకు హైదరాబాద్‌లో మరో వ్యక్తి ప్రాణాలు తీసుకున్నాడు. తీసుకున్నది లక్ష. చెల్లించింది 6 లక్షలు. అయినా వేధింపులు ఆగలేదు. బాకీ మొత్తం చెల్లించాలంటూ పదే పదే ఫోన్ కాల్స్… ఫోన్ ఎత్తకపోవడంతో.. ఈ విషయాన్ని ఫ్రెండ్స్, బంధువులకు అందించారు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

అయినా వేధింపులు ఆగలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆ లోన్ యాప్ బాధితుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మేడ్చల్ మండలం గుండ్ల పోచంపల్లిలో చంద్రమోహన్‌కు ఆన్‌లైన్ యాప్ వేధింపులు పెరగడంతో మనస్థాపానికి గురై సూసైడ్‌కు పాల్పడ్డాడు. భార్య, పిల్లలను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు ప్రైవేటు ఉద్యోగి.