పొలం రేటు పెరిగింది, అత్యాశతో ఇద్దరికి అమ్మారు, కత్తిపోట్లకు గురయ్యారు

అందరూ భూమి నాకు సొంతం..నాకు సొంతం అని గొడవలకు దిగుతారు. కానీ నిజం ఏంటంటే అందరూ భూమికే సొంతం. చివరికి 6 అడుగుల నేలే అందరికి కావాల్సింది.

పొలం రేటు పెరిగింది, అత్యాశతో ఇద్దరికి అమ్మారు, కత్తిపోట్లకు గురయ్యారు
Horrific Incident
Follow us

|

Updated on: Nov 15, 2020 | 1:36 PM

అందరూ భూమి నాకు సొంతం..నాకు సొంతం అని గొడవలకు దిగుతారు. కానీ నిజం ఏంటంటే అందరూ భూమికే సొంతం. చివరికి 6 అడుగుల నేలే అందరికి కావాల్సింది. తాజాగా భూమి ధర అమాంతం పెరగడంతో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. భూమిని మరొకరికి అమ్మాలని ప్రయత్నం చేయడంతో కత్తితో దాడి చేసిన దారుణ ఘటన విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.  భోగాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పూసపాటిరేగ మండలం కోనాడకి చెందిన రామగురువులు తన రెండెకరాల భూమిని అమ్మేందుకు దగ్గరి బంధువైన అచ్చిబాబుతో అగ్రిమెంట్ చేసుకుంది. అందుకోసం అస్వాన్స్ కూడా కూడా తీసుకుంది. అయితే ఆ భూమికి భూమ్ పెరగడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో అత్యాశతో విజయవాడకి చెందిన మరొకరికి విక్రయించేందుకు రెడీ అయ్యింది. తన కూతురు అరుణతో కలిసి భోగాపురం సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసును వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న అచ్చిబాబు తన కుమారులు ఉపేంద్ర, వెంకటేష్, మరొకరు అప్పలరెడ్డితో కలసి రిజిస్ట్రార్ ఆఫీసుకు వచ్చాడు. తన వద్ద అడ్వాన్స్ తీసుకుని మరొకరికి భూమి ఎలా అమ్ముతారంటూ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.

తమని మోసం చేశారన్న ఆగ్రహంతో అచ్చిబాబు కుమారుడు ఉపేంద్ర తన తమ్ముడు వెంకటేష్, ఫ్రెండ్ అప్పలరెడ్డితో కలసి కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో రామగురువులు కూతురు అరుణ, భూమి కొనుగోలుదారుల తరఫున వచ్చిన కాణిపాక గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు వద్దే హత్యాయత్నం జరగడంతో కలకలం చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి  చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న అరుణ, ప్రవీణ్ కుమార్‌ను వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Also Read :

కొమురంభీం జిల్లాలో కానిస్టేబుల్ మిస్సింగ్, భార్య ఫిర్యాదు, ఇక్కడే అసలు ట్విస్ట్ !

‘కారు మాదే, యాక్సిడెంట్ చేసింది నా కుమారుడు కాదు’ : సైబర్‌ టవర్స్‌ వద్ద ప్రమాదంపై ఎమ్మెల్యే కాటసాని వివరణ