ట్విటర్‌ కో ఫౌండర్‌ రాజీనామా

ట్విటర్‌ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ట్విట్టర్‌కు దూరం కానున్నారు. పుష్కరకాలం పాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్‌ అనూహ్యంగా బోర్డునుంచి  వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయితే ట్విటర్‌కు తన సహకారం ఉంటుందని తెలిపారు. ఈ నెల చివరి నుంచి  తన  రాజీనామా  అమల్లోకి  వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు అందించిన సమాచారంలో తెలిపారు.  అటు వరుస ట్విట్లలో కూడా విలియమ్స్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్‌ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఇవాన్ విలియమ్స్  పేర్కొన్నారు.  ఏది ఏమైనా సోషల్ […]

ట్విటర్‌ కో ఫౌండర్‌ రాజీనామా
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:19 PM

ట్విటర్‌ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ట్విట్టర్‌కు దూరం కానున్నారు. పుష్కరకాలం పాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్‌ అనూహ్యంగా బోర్డునుంచి  వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయితే ట్విటర్‌కు తన సహకారం ఉంటుందని తెలిపారు.

ఈ నెల చివరి నుంచి  తన  రాజీనామా  అమల్లోకి  వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు అందించిన సమాచారంలో తెలిపారు.  అటు వరుస ట్విట్లలో కూడా విలియమ్స్‌ ఈ విషయాన్ని ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్‌ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఇవాన్ విలియమ్స్  పేర్కొన్నారు.  ఏది ఏమైనా సోషల్ మీడియాలో ట్విట్టర్ అగ్రపథాన నిలబెట్టడంలో కృషి చేసిన ఇవాన్ రాజీనామా సంస్థకు పెద్ద లోొటే.