ఇక ఏటీఎంలో డబ్బు తీయాలంటే ఓటీపీ కంపల్సరీ

ఏటీఎంలో డబ్బు తీసుకోవాలంటే మొబైల్ ఫోన్ ఇక మరింత కీలకం కానుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన తెచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది.

ఇక ఏటీఎంలో డబ్బు తీయాలంటే ఓటీపీ కంపల్సరీ
Follow us

|

Updated on: Sep 17, 2020 | 8:08 PM

ఏటీఎంలో డబ్బు తీసుకోవాలంటే మొబైల్ ఫోన్ ఇక మరింత కీలకం కానుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన తెచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలలోనూ ఇది వర్తిస్తుంది. ఓటీపీ ఆధారిత విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి రానుంది. అంటే.. ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి న‌గ‌దు తీసుకోవాలంటే ఇకపై తప్పనిసరిగా వన్‌ టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ) ఎంట‌ర్ చేయాల్సిందే. ఈ నెల 18 నుంచి రోజులో అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) 10 వేలు రూపాయలు.. అంతకుమించి చేసే నగదు ఉపసంహరణలకు పిన్‌ నంబర్‌తోపాటు ఓటీపీ నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకు ఖాతాకు లింక్‌ చేసిన ఉన్న రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ నమోదు చేస్తేనే ఏటీఎంలో నుంచి నగదు వస్తుంది. ఓటీపీ లేకపోతే 10 వేల రూపాయలకు మించి న‌గ‌దు తీసుకోలేరు. ఇప్పటివరకూ రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంల్లో రూ.10వేలకు మించి చేసే ఉపసంహరణలకు వినియోగదారుల మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఇవ్వడం తప్పనిసరిగా అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడిక అన్ని వేళల్లోనూ (24గంటల పాటు) ఈ నిబంధనను అమలు చేయాలని ఎస్‌బీఐ నిర్ణయం తీసుకుంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!