పెట్రోల్ బంక్‌లో ఘటన.. బెంగాలీ నటికి వేధింపులు..!

ప్రముఖ బెంగాలీ నటి జూహీ సేన్‌గుప్తా వేధింపులకు గురయ్యారు. కోల్‌కతాలోని కస్బా అనే ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 15 వందల రూపాయలకు పెట్రోల్ పోయమని చెప్పగా.. అక్కడి సిబ్బంది 3వేలకు మించి పెట్రోల్ పోశారు. దీంతో.. బాధితురాలి తండ్రి ఇదేమని ప్రశ్నించగా.. ఆయనపై పెట్రోల్ బంక్ సిబ్బంది దౌర్జన్యంగా కిందికి తోసేశారని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగిందని, బంక్ సిబ్బంది […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:34 pm, Tue, 27 August 19
పెట్రోల్ బంక్‌లో ఘటన.. బెంగాలీ నటికి వేధింపులు..!

ప్రముఖ బెంగాలీ నటి జూహీ సేన్‌గుప్తా వేధింపులకు గురయ్యారు. కోల్‌కతాలోని కస్బా అనే ప్రాంతంలో ఓ పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి వెళ్లిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. 15 వందల రూపాయలకు పెట్రోల్ పోయమని చెప్పగా.. అక్కడి సిబ్బంది 3వేలకు మించి పెట్రోల్ పోశారు. దీంతో.. బాధితురాలి తండ్రి ఇదేమని ప్రశ్నించగా.. ఆయనపై పెట్రోల్ బంక్ సిబ్బంది దౌర్జన్యంగా కిందికి తోసేశారని ఆమె తెలిపింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగిందని, బంక్ సిబ్బంది కారు తాళం లాక్కుకుని మరింత ఇష్యూ చేశారని వాపోయింది. కాగా, నటి ఫిర్యాదుతో.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. చివరకు ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. తనకు కలిగిన ఈ చేదు అనుభవాన్ని జూహీ సేన్‌గుప్తా తన ఫేస్ బుక్ లో షేర్ చేశారు.