Tunwal TZ Bike: మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌ను విడుదల చేసిన తున్వాల్ కంపెనీ.. పెట్రోల్ బైక్‌లను తలపించేలా..

Tunwal TZ Bike: గుజ‌రాత్‌కు చెందిన 'తున్వాల్ ఈ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' సంస్థ రూపొందించిన తున్వాల్ టీజెడ్ బైక్ యువతను ఆకర్షిస్తోంది.

Tunwal TZ Bike: మార్కెట్‌లోకి సరికొత్త బైక్‌ను విడుదల చేసిన తున్వాల్ కంపెనీ.. పెట్రోల్ బైక్‌లను తలపించేలా..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 2:02 PM

Tunwal TZ Bike: గుజ‌రాత్‌కు చెందిన ‘తున్వాల్ ఈ కంపెనీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ రూపొందించిన తున్వాల్ టీజెడ్ బైక్ యువతను ఆకర్షిస్తోంది. తున్వాల్ ఇప్పటివరకు ప‌లు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఇది చూడ‌డానికి సాధార‌ణ పెట్రోల్ బైక్‌లా క‌నిపిస్తుంది. ఇందులో స్ట్రోమ్ జెడ్ఎక్స్, స్పోర్ట్ 63 48వి, స్పోర్ట్ 63 60వి, లిథినో-లి, ఎలెక్ట్రికా 60 వంటివి ఉన్నాయి. తాజాగా తున్వాల్ ఇ-వెహికల్ తన మొద‌టి ఇ- బైక్ తున్వాల్ TZ ను కూడా ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరంలో మార్కెట్‌లో ఇది అందుబాటులో ఉంటుంది.

ఈబైక్ స్వరూపం అచ్చం పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ మాదిరిగా ఉంటుంది. మ‌ల్టిపుల్ క‌ల‌ర్ డిజైన్‌తో చూడ‌గానే ఆక‌ట్టుకుటుంది. యాంటీలాక్స్ బ్రేకింగ్ సిస్టం ఉంటుంది. ముందువైపు టెలిస్కోపిక్ షాక్అబ్జర్బర్స్, వెనుక‌వైపు డూయ‌ల్ షాక‌బ్జర్స్‌ను చూడొచ్చు. ముందు వెనుక డిస్క్ బ్రేక్‌ల‌ను వినియోగించారు. అలాగే ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ ఉంటుంది. రిమోట్ కీ ఉంటుంది. చూడ‌డానికి పెట్రోల్ బైక్‌లా క‌నిపించేందుకు ఇందు‌లో డ‌మ్మీ పెట్రోల్ ట్యాంకును అమర్చడం విశేషం. ఇందులో వాడిన లిథియం అయాన్ బాట‌రీని 3 నుంచి 4గంట‌ల్లో ఫుల్ చార్జి చేయ‌వ‌చ్చు. సింగిల్ చార్జితో 120 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్రయాణించగలదు.