భారత్ బోర్డర్‌లో‌ పాక్‌ పన్నాగం… నాగోట్రా టెర్రరిస్టులు ఇదే సొరంగాన్ని ఉపయోగించారు..

బోర్డర్‌ పాక్‌ పన్నాగం మరోసారి బయటపడింది. సాంబా సెక్టార్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కనిపెట్టారు. నాగోట్రా ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు ఉగ్రవాదులు కూడా ఇదే టన్నెల్‌...

  • Sanjay Kasula
  • Publish Date - 7:07 pm, Sun, 22 November 20
భారత్ బోర్డర్‌లో‌ పాక్‌ పన్నాగం... నాగోట్రా టెర్రరిస్టులు ఇదే సొరంగాన్ని ఉపయోగించారు..

Tunnel Detected : బోర్డర్‌ పాక్‌ పన్నాగం మరోసారి బయటపడింది. సాంబా సెక్టార్‌లో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న సొరంగాన్ని బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కనిపెట్టారు. నాగోట్రా ఎన్‌కౌంటర్‌లో హతమైన నలుగురు ఉగ్రవాదులు కూడా ఇదే టన్నెల్‌ నుంచి భారత్‌ లోకి చొరబడినట్టు గుర్తించారు. జేషే మహ్మద్‌ ఉగ్రవాదులు పాక్‌ సైన్యం సహకారంతో సరిహద్దుల్లో చొరబడ్డారు. 150 మీటర్ల పొడవైన టన్పెల్‌ను బీఎస్‌ఎఫ్‌ గుర్తించింది. పాక్‌ సైన్యమే ఈ టన్పెల్‌ను నిర్మించినట్టు అనుమానిస్తున్నారు.

పాక్‌ నుంచి ఈ సొరంగమార్గం నుంచే ఉగ్రవాదులు కశ్మీర్‌ లోకి చొరబడినట్టు గుర్తించారు. కశ్మీర్‌లో నవంబర్‌ 28 నుంచి ప్రారంభమయ్యే డిస్ట్రిక్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఎన్నికలను అడ్డుకోవడానికే ఉగ్రవాదులు కుట్రలు చేస్తునట్టు గుర్తించారు. ఎల్‌వోసీ దగ్గర గత కొద్దిరోజులుగా చాలా టన్పెల్స్‌ బయటపడుతున్నాయి. టన్నెల్‌లో లభించిన సిమెంట్‌ బస్తాలపై స్పష్టంగా మేడ్‌ ఇన్‌ పాకిస్తాన్‌ అని రాసి ఉంది.

పాక్‌ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నామని తెలిపారు జమ్ముకశ్మీర్‌ డీజీపీ దల్బీర్‌సింగ్‌. టన్నెల్‌ బయటపడ్డ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఉగ్రవాదుల చొరబాటు కోసమే ఈ సొరంగమార్గాన్ని పాక్‌ నిర్మించిందన్నారు.